(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)
కరోనా మహమ్మారి కుటుంబాలను నాశనం చేస్తోంది. కరోనా మొదటి దశలో కరోనా మరణాలు చాలా తక్కువగా నమోదయినా.. సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇంటికి పెద్ద దిక్కులను కోల్పోయి కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కరోనాతో కన్నతల్లి మృతి సొంత అన్న వదినలకు కరోనా బారిన పడడంతో ఓ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చిన్నప్పుడే పోలియో బానిన పడిన అతడికి కాళ్లు పని చేయవు. అంగవైకల్యంతో అతడి ఆలనా పాలనా చూసే అమ్మ.. కంటికి రెప్పలా చూసుకునే అన్న వదిన లు సుఖంగా సాగిపోతున్న కుటుంబం లోకి కరోనా మహమ్మారి కాటు వేసింది. గత కొంతకాలం క్రితం కరోనాతో తల్లి చనిపోగా.. అన్నవదినలకు కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లారు. దీంతో ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు. అతడికి ఏమి చేయాలన్నా ఒకరు తోడుండాలి. కుటుంబం మొత్తం వైరస్ బారిన పడటంతో మనస్థాపం చెందాడు. దీంతో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు వారి ఇంట్లో కరోనా ఉందన్న కారణంతో ఎవరూ వెళ్లకపోవడంతో అతడు అక్కడే కుప్పకూలాడు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలోని ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి కాటు వేసింది. నాలుగు రోజుల క్రితం తల్లి కరోనా తో మృతి చెందింది. అన్న వదిన లు కరోనాతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చిన్నప్పుడే పోలియో బారిన పడి బాధపడుతున్న రాజేష్ మనస్థాపంతో ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని గ్రామస్తులు ఆసుపత్రికి తీసకెళ్లేందుకు ఇష్టపడలేదు. కారణం వాళ్ల ఇంట్లో కరోనా రోగులు ఉన్నారని.
సమాచారం అందుకున్న పోలీసులు 108 సిబ్బిందిని పలిపించి కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్ నగర్ జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. గొంతు నరం కట్ కావడంతో పరిస్థితి విషమంగా ఉందని రక్తం ఆగడం లేదని బతకడం కష్టమని వైద్యులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Crime, Disabled person, Mahabubnagar, Man commit to suicide, Telangana