Organic agriculture :వ్యవసాయమే పండగా..పుడమితల్లే అండగా..

చదువును పక్కన పెట్టి..వ్యవసాయమే మక్కువగా ఎంతోమంది అధ్బుతాలు సాధిస్తున్నారు..బీటెక్ చదువుకున్న రైతు

Organic agriculture : చదువును పక్కన పెట్టి..వ్యవసాయమే మక్కువగా ఎంతోమంది అధ్బుతాలు సాధిస్తున్నారు..బీటెక్ చదువుకున్నా..బంగారు భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు..ఆధునిక అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తూ కొంతమంది ఆదర్శంగా నిలుస్తున్నారు..

  • Share this:


    ఏదైనా సాధించాలనే అని పట్టుదల ఉంటే వయస్సు తో పనిలేదని నిరూపించాడు.60 సంవత్సరల వయసు ఉన్న ప్రభాకర్. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలను వదిలి పట్టణాలలో ఉండాలి, మంచి జీవితాన్ని ఆనందించాలి అని పరుగులు తీస్తున్న యువతకు దీటుగా హైదరాబాద్ లోని మూగల ప్రభాకర్ వృత్తిరిత్యా సివిల్ ఇంజినీర్ పల్లెకు చేరి 13 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తున్నాడు. సేంద్రియ పంటలతో ఆరోగ్యవంతమైన జీవితం సొంతం చేసుకోవచ్చు అంటున్నాడు ప్రభాకర్. ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న సేంద్రియ వ్యవసాయ విధానంపై న్యూస్ 18 తెలుగు ప్రత్యేక కథనం..

    వివరాల్లోకి వెళితే...రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో 13 సంవత్సరాల క్రితం మూగల ప్రభాకర్ కొంత భూమిని కొనుగోలు చేసి ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం అనేది క్రిమిసంహారక మందులు వేసి పండిస్తున్నారు.దానివల్ల కాన్సర్,హార్ట్ అటాక్, అల్సర్ వంటి జబ్బులు 90 శాతం ఈ కలుషిత ఆహారం వల్లనే అని తెలుసుకొని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం సేంద్రియ పద్ధతిలోనే పంటలను పండించాలని నిర్ణయించుకొని ప్రధానంగా మామిడి తోటను సేంద్రియ పద్దతిలో పండించాడు .వాటితో పాటు నిమ్మ,జామ, కొన్ని కూరగాయలు,వరి పండించేవారు .

    ప్రతి సంవత్సరం మామిడి పండ్లను ఏ దళారికి ఇవ్వకుండా వారే హైద్రాబాద్ లో సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు.కానీ ఈసారి కొంత పంటను మామిడిపండ్లను ఈ ప్రాంతంలో అమ్మాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు సేంద్రియ పద్దతిలో పండిన పండ్లను,కురాయగాయలను తింటే ఎటువంటి రోగాలు దరిచేరవు అని ప్రభాకర్ అన్నారు.అలాగే రైతులు కూడా సేంద్రియ పంటలవైపు మొగ్గు చూపి ప్రజల ఆరోగ్యాలను మన ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు.

    ప్రస్తుతం మామిడి పండ్లు కావాల్సిన వినియోగదారులకు సిరిసిల్ల పట్టణంలో డోర్ డెలివరీ సదుపాయాన్ని ఇస్తున్నామని కావాల్సిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు . సేంద్రియ పద్దతిలో పండించిన మామిడిపండ్ల కోసం 88850 24066 అనే నెంబర్ కు సంప్రదించాలని కోరారు.
    Published by:yveerash yveerash
    First published: