150 గుడ్లు పెట్టిన కోడి.. చూసేందుకు ఎగబడుతున్న జనం..

ప్రతీకాత్మక చిత్రం

కోడి ఇలా గుడ్లు పెడుతుండటం దాన్ని పెంచుకుంటున్న రామకృష్ణాచారి కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో.. వారంతా కోడిని చూడటానికి ఎగబడుతున్నారు.

  • Share this:
    సాధారణంగా ఒక కోడి ఆర్నెళ్లలో ఎన్ని గుడ్లు పెడుతుంది. మహా అయితే ఓ 50.. కానీ ఓ నాటుకోడి ఏకంగా 150 గుడ్లు పెట్టింది. ఇంకా విశేషమేంటంటే.. ఇప్పటికీ ఆ కోడి గుడ్లు పెడుతూనే ఉంది.నాగర్‌కర్నూల్ జిల్లా దేవల్‌తిర్మలాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోడి ఇలా గుడ్లు పెడుతుండటం దాన్ని పెంచుకుంటున్న రామకృష్ణాచారి కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో.. వారంతా కోడిని చూడటానికి ఎగబడుతున్నారు. కొందరైతే తమకూ అలాంటి కోడి కావాలని.. దాని గుడ్లను తీసుకెళ్లి పొదుగేసుకుంటున్నారు. కోడి ఇలా గుడ్లు పెడుతుండటంపై స్థానిక పశు వైద్యాధికారిని సంప్రదించగా.. జన్యు లోపం వల్లే ఇలా జరుగుతోందన్నారు. లక్షల్లో ఒక కోడికి ఇలాంటి లక్షణాలు బయటపడుతాయని చెప్పారు
    First published: