జగిత్యాల (jagityal) జిల్లాలో ఘోర ప్రమాదం (car Accident) చోటుచేసుకుంది. జిల్లాలోని రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో గల చిన్నగట్టు వద్ద శనివారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు (Car Fell into Well)) దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న మల్యాల మండలానికి చెందిన చందు తన నలుగురు మిత్రులతో కలిసి శ్రీరాముల పల్లెకు బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో చిన్న గట్టు సమీపంలో గల వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. అయితే కారులో ఉన్న ఐదుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడగా చందు ఫ్రెండ్ కిషోర్ కారులో గల్లంతయ్యాడు. కారును క్రేన్ సాయంతో సుమారు 6 గంటల రెస్క్యూ అనంతరం బయటకు తీశారు. గల్లంతైన కిషోర్ మృతి చెందగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.
కరీంనగర్ జిల్లాలో..
ఇలా కారు అదుపు తప్పి బావిలో పడిపోయిన ఘటనలు గతంలోనూ జరిగాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామడి మండలంలోని చిన్న ముల్కనూర్ దగ్గరలో కారు బావిలోకి దూసుకెళ్లింది. బావి లో నుంచి కారు ను బయటకు తీసిన గజ ఈతగాళ్లు కారులో ఒక మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆ శవం భీమదేవరపల్లి మండలానికి చెందిన రిటైడ్ ఎస్సై పాపయ్య నాయక్ మరియు భీమదేవరపల్లి మండల వాసిగా గుర్తించారు. ఉదయం 11 గంటలకు చిన్న ముల్కనూరు బావిలో పడిన కారు తొమ్మిది గంటలపాటు శ్రమించి కారు ను రెస్క్యూ టీం బయటకు తీశారు. అప్పటివరకు అంత బాగానే ఉంది. అప్పటి వరకు మృతదేహం కోసం వెతుకుతున్నారు. అయితే విగతజీవిగా బావిలోంచి బయటపడ్డ మృతదేహం అన్నది కావడం.. మృతదేహం కోసం వెతికే వ్యక్తి తమ్ముడు కావడం ఇక్కడ విచారకరం.
ఈ విషాదగాధకు కరీంనగర్ జిల్లాలో చిన్నముల్కనూరు ప్రాంతం కేంద్రమైంది . కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే రహదారిలో వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తూ ఓ కారు దూసుకెళ్లి పడిపోయింది . 9 గంటల పాటు శ్రమిస్తేనేగానీ ... రాత్రి 8 గంటల వరకూ వెలికితీయలేని గడ్డు స్థితి . ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులతో పాటే ... ఫైర్ సిబ్బంది వెళ్లి ప్రయత్నాలు మొదలెట్టారు . క్రేన్ల సాయంతో కారు తీస్తున్న క్రమంలో .. కారు జారిపోతోందే తప్ప పైకి రావడంలేదు . దాంతో మూడు భారీ మోటార్లు ... దానికి కావల్సిన జనరేటర్లు పెట్టి ఎలాగోలా కారుని పైకి తీశారు. కానీ కారులో ఉన్నది ఒక్కరేనని తేలింది. ఫైర్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న బూదయ్య కూడా అందరితో పాటే ఉదయం నుంచీ ఆ మృతదేహం వెలికితీతలో శ్రమిస్తున్నాడు .
కానీ పైకి వచ్చిన ఆ మృతదేహం తన అన్న పాపయ్య నాయక్ ది కావడంతో ఒక్కసారిగా తమ్ముడు బుదయ్య కన్నీటి పర్యంతమయ్యారు. అది చూసి తట్టుకోలేక అన్న దేహము పై పడి ఎక్కి ఎక్కి ఏడ్చాడు.. ఆ బావిలోంచి కరెంట్ జనరేటర్లు పెట్టి మోటార్లతో తోడిన నీళ్లు చిన్నబోయాయి . అందుకే కొన్ని సంఘటనలు మనస్సులను కలచివేస్తాయి . మృతి చెందిన సోదరుడు విగతజీవై వెళ్లిపోతే ... అన్న మరణించడాని తెలియకుండానే ... తనకోసం గాలించిన తమ్ముడి బాధ ఆ సమయాన వర్ణనాతీతం .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Jagityal