హోమ్ /వార్తలు /తెలంగాణ /

Snake: జీవితాలను చిదిమేసిన సర్పం.. ఆ గిరిజన కుటుంబానికే ఎందుకు అలా జరిగింది?

Snake: జీవితాలను చిదిమేసిన సర్పం.. ఆ గిరిజన కుటుంబానికే ఎందుకు అలా జరిగింది?

పాము కాటుకు ఇద్దరు మృతి

పాము కాటుకు ఇద్దరు మృతి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాట గుడా పరిధిలోని మారుతిగూడ (Marutiguda) గ్రామనికి చెందిన అత్రం రాజు కవితబాయి దంపతులకు ఏడుగురు సంతానం. కానీ, ఆ కుటుంబంలో ఓ సర్పం విషాదం నింపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Adilabad, India

పాము కాటుతో (Snake bite) కొలాం ఆదివాసి గిరిజన కుటుంబానికి (Tribal family) చెందిన అన్నా చెల్లెలు (Brother and sister)ఇద్దరు ఒకేసారి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పాట గుడా పరిధిలోని మారుతిగూడ (Marutiguda) గ్రామనికి చెందిన అత్రం రాజు కవితబాయి దంపతులకు ఏడుగురు సంతానం. అయితే శనివారం అర్ద రాత్రి ఇంట్లో నిద్రస్తున్నసమయంలో పాము కాటువేయడంతో మూడేళ్ల అత్రం దీపా, పన్నెండు సంవత్సరాల అత్రం భీంరావ్ ఇద్దరు సృహ కోల్పోయారు. ఆసుపత్రికి తీసుకువెళ్ళేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నం చేశారు.

అంబులెన్స్ రావడానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో హుటాహుటిన ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి తరలించేంతలోపునే ఇరువురు అన్నా చెల్లెలు మృతి చెందారు. అనంతరం శవ పంచనామ కోసం మృతదేహాలను ఉట్నూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాగా పాము కాటుతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు వెడమ బోజ్జు ఉట్నూరులోని ఆసుపత్రికి వెళ్ళి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఆయన మాట్లాడుతూ గత కొంతకాలం నుండి ఇంద్రవెల్లి మండలం పాటగూడ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని అన్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టి కి తీసుకువెళ్ళినా పట్టించుకోని పరిస్థితి ఉందని విమర్శించారు. గ్రామానికి సరైన  రోడ్డు సౌకర్యం ఉంటే ఇద్దరు పిల్లలను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళేవారని, వారిద్దరు బ్రతికే వారని పేర్కొన్నారు. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.

Father killed son: దుబాయ్​ నుంచి వచ్చిన కొడుకుని నరికి చంపిన తండ్రి.. కారణం ఏంటో తెలుసా?

అనంతరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, పి.వి.టి.జి అధికారి ఆత్రం భాస్కర్ తో మాట్లాడి పోస్టుమార్టం అనంతరం వారి అంబులెన్స్ ను సమకూర్చి వారిని స్వగ్రామానికి పంపించారు.  తక్షణ సహాయం కింద పివిటిజి అధికారి భాస్కర్ ఐటిడిఏ తరఫున పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి ఐటిడిఏ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇంద్రవెల్లి ఎస్.ఐ సునీల్, ఏ.ఎస్.ఐ భీంరావు పంచనామా నిర్వహించారు. ఇదిలా ఉంటే ఇలా ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో పాటగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

First published:

Tags: Adilabad, Snake bite, Tribes

ఉత్తమ కథలు