హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam : అక్క, బావ వేధింపులు భరించలేను.. నేను చనిపోతా.. సీఎంకు సెల్ఫీ వీడియో..

Khammam : అక్క, బావ వేధింపులు భరించలేను.. నేను చనిపోతా.. సీఎంకు సెల్ఫీ వీడియో..

బాధిత విద్యార్థి

బాధిత విద్యార్థి

Khammam : దురదృష్టవశాత్తు కొద్ది రోజుల వ్వవధిలోనే తల్లిదండ్రులను కోల్పోయిన తన సొంత తమ్ముడి సంరక్షణనను చూసుకోవాల్సిన అక్క బావలు ఆ బాలుడికి ఆస్థి కోసం చుక్కలు చూపించారు.. దీంతో వారి బాధలు భరించలేనట్టు ఆ బాలుడు ఏకంగా సీఎం కేసిఆర్‌ను ఓ సెల్ఫీ వీడియో ద్వారా కోరాడు..

ఇంకా చదవండి ...

కొంతమందిని విధి వెంటాడితే.. వారిని చేరదీయాల్సిన కుటుంబ సభ్యులు వారి పాలిట మరింత శత్రువులుగా మారుతున్నారు. రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం పరాయి వాళ్ల వలే ట్రీట్ చేస్తుంటారు. బాధితులకు ఎవరు అండగా నిలిచేందుకు ముందుకు రాకుండా చేసి వారి ఆస్థిపై కన్నేసి తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇలా చాలా కుటంబాల్లోని తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం వయస్సు చిన్నదే అయినా తమకు జరుగుతున్న అన్యాయన్ని ,వేధింపులను సమాజం దృష్టికి తీసుకువస్తున్నారు.

తాజాగా ఇలా ఇటివల తన తండ్రిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడు తన అక్క, బావా వేధింపులు భరించలేక తనకు తాను చనిపోయోందుకు అవకాశం ఇవ్వాలని నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాయడం సంచలనంగా మారింది. కాగా ఆ విద్యార్థి ప్రస్తుతం పదవ తరగతి చదువుతుండడం విశేషం.

Hyderabad : పెళ్లి కావడం లేదని పురోహితుడి వద్దకు వెళితే.. తానే పెళ్లి చేసుకుంటానని..

వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కి చెందిన గోరింట్ల లక్ష్మీనారాయణ మండలం లోని బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడి గా పనిచేసేవాడు. అనారోగ్యంతో ఆయన మరణించడం తో ఆయన భార్య సుజాత కు అటెండర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆమెకు ఇద్దరు పిల్లలు, కూతురు తో పాటు ,ఒక కుమారుడు ఉన్నారు.కూతురికి వివాహం కాగా కుమారుడు సాయి 10 వ తరగతి చదువుతున్నాడు. గత సంవత్సరం లో అనారోగ్యంతో తల్లి సుజాత కూడా మరణించింది.


అప్పటి నుంచి సాయి హుజూర్ నగర్ లో తన అక్క బావల వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో వారి అమ్మ ఉద్యోగం తో పాటు ఉన్న డబ్బులు వచ్చే బెనిఫిట్స్ తనకే కావాలంటూ సాయిని వాళ్ళ అక్క బావలు వేధింపులకు గురి చేస్తున్నారని సాయి ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో రోజు రోజు కు వేధింపులు తట్టుకోలేక హుజూర్ నగర్ నుంచి నేలకొండపల్లి కి వచ్చిన సాయి తనే సొంతంగా కిరాయి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.అయినా తన అక్క,బావఫోన్ చేసి  వేధిస్తున్నారని ఇక తాను బ్రతకలేనని తనకు ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదని అందుకే కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను మీడియా ద్వారా కోరుతున్నాడు. తన మరణానికి కారణమవుతున్న తన అక్క,బావ లపై చర్యలు తీసుకోవాలని సాయి  కోరుతున్నాడు.

First published:

Tags: CM KCR, Khammam, Selfie video suicide

ఉత్తమ కథలు