Home /News /telangana /

Rangareddy : రాయితో కొట్టి ..కొనఊపిరితో ఉన్నాడంటూ 100 డయల్ చేసిన ఓ బాలుడు..

Rangareddy : రాయితో కొట్టి ..కొనఊపిరితో ఉన్నాడంటూ 100 డయల్ చేసిన ఓ బాలుడు..

arrest

arrest

Ranga reddy : మత్తు మైకంలో ఉన్న యువకున్ని ఓ బాలుడి బండరాయితో కొట్టాడు. ( Boy killed young man ) దీంతో ఆ యువకుడు సృహ కోల్పోయి కిందపడిపోవడంతో... రాయితో కొట్టిన బాలుడే తిరిగి 100కు డయల్ చేసి.. కొనఊపిరితో ఉన్నాడంటూ కాల్ చేశాడు..

    తాగిన మైకంలో ఓ యువకుడు చేసిన పనికి తన ప్రాణాలనే కోల్పోయాడు.. తనది కాని బైకుపై కూర్చోని.. మద్యం మత్తులో అసలు బైకు ఓనర్‌తో వివాదానికి దిగాడు.. దీంతో మాట మాట పెరిగి.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.. అది కాస్తా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.( Boy killed young man ) కాగా దాడి చేసిన బాలుడే పోలీసులకు ఫోన్ చేసి తాను ఒకడిని కొట్టాను..వాడు కొనఊపిరితో ఉన్నాడు సార్ అంటూ కాల్ చేశాడు.

    వివరాల్లోకి వెళితే..రంగారెడ్డి జిల్లా ( Rangareddy ) మొయినాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్‌ గ్రామానికి చెందిన దుబ్బ సతీశ్‌ (26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఫుల్లుగా మద్యం సేవించి తూలుకుంటూ మండల కేంద్రంలోని పోచమ్మ గుడి వద్ద నుంచి వెళ్తున్నాడు. అదే సమయంలో పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ బాలుడు అతని స్నేహితులు నలుగురు ఫొటోలు దిగేందుకు అటువైపు వచ్చారు. అయితే గుడి దగ్గర బాలుడి స్నేహితుడికి చెందిన బైక్‌ ఆపారు. దానిపై బాలుడు కూర్చొని ఉండగా మద్యం మత్తులో ఉన్న సతీశ్‌ తన బైక్‌పై ఎందుకు కూర్చున్నావని బాలుడిని ప్రశ్నించాడు.


    Breaking : నల్లా.. నీళ్లలో కుళ్లిపోయిన శవం.. వాటర్‌ ట్యాంకు లోపల దారుణం..!


    దీంతో షాక్ తిన్న ఆయువకుడు .. ఆ బైక్‌ నీదికాదు నా ఫ్రెండ్‌దని సమాధానం చెప్పాడు.. ఇది పట్టించుకోని సతీష్ ఆ బాలున్ని కొట్టేందుకు ప్రయత్నించాడు.. దీంతో తిరిగి ఆ బాలుడు అతన్ని నెట్టాడు.. కిందపడిన సతీశ్‌ లేచి తిరిగి కొట్టే ప్రయత్నం చేయడంతో, బాలుడు పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని అతని తలపై బాదాడు... దీంతో సతీశ్‌ తల పగిలి తీవ్ర కారింది..( Boy killed young man ) దీంతో బాలుడు తన స్నేహితులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    కాగా, సాయంత్రం ఆరు గంటల సమయంలో ఘటన జరగడం, అప్పటికే చీకటి పడటంతో పాటు సతీష్ మద్యం మత్తులో ఉండడంతో..అటువైపు ఎవరూ వెళ్లి చూడలేదు. కాగా సృహ తప్పి పడిపోయిన వాడు ఉన్నాడా లేక ఏదైనా జరిగిందా అనే అనుమానంతో మరోసారి రాయితో కొట్టిన ఆ బాలుడు రాత్రి 10 గంటల సమయంలో గుడి వద్దకు వచ్చాడు..( Boy killed young man ) అప్పటికీ.. ఇంకా అక్కడే పడి ఉన్న సతీశ్‌ కొన ఊపిరితో ఉండటంతో బయపడి 100కు డయల్‌ చేశాడు. తాను బండరాయితో ఒకరిని కొట్టానని, అతనింకా కొనఊపిరితో ఉన్నాడని సమాచారం ఇచ్చాడు.

    Breaking : ఇసుక మాఫియా దాడిలో వీఆర్ఏ మృతి...?


    వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సతీశ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ( Boy killed young man ) కేసు నమోదు చేసి నిందితుడు, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, Hyderabad, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు