అంథ యువతి అద్భుత ప్రతిభ.. పాటలు, పద్యాలు అన్నీ వెనుక నుంచి పాడుతుంది

అనూష ఒక అంథురాలు ఐనా కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా సంకల్పం తో అవలీలగా రివర్స్ లో పాటలు, మాటలు పడగలుగుతుంది.

news18-telugu
Updated: October 7, 2020, 11:00 PM IST
అంథ యువతి అద్భుత ప్రతిభ.. పాటలు, పద్యాలు అన్నీ వెనుక నుంచి పాడుతుంది
భర్త, కుమార్తెతో అనూష
  • Share this:
పట్టుదల ఉండాలేగాని సాధించలేనిది ఏమి లేదని అంటున్నది కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన అనూష. ఏ మాటయినా ఏ పాటైనా రివర్స్ లో పడగల సత్తా అనూష చిన్ననాటి నుండే అలవాటయింది. అనూష ఒక అంథురాలు ఐనా కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా సంకల్పం తో అవలీలగా రివర్స్ లో పాటలు, మాటలు పడగలుగుతుంది. అనూష సొంతూరు వరంగల్ జిల్లాఎల్కతుర్తి. అత్తగారి ఇల్లు కరీంనగర్ రేకుర్తి గ్రామం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అనూష, భర్త కూడా ఇద్దరు అంథులు ఐనా కూడా మొక్కవోని దీక్షగా రివర్స్ లో పాటలు పాడి అందరిని అబ్బురపరుస్తుంది. అనూష అంథురాలి కాబ్బట్టి వారికి ప్రత్యేక లిపి ద్వారా ముందుగా పాటను రాసుకొని ఆ తరువాత మునివేళ్ళ ద్వారా ఆ అక్షరాలను తడుముతూ పాటలు రివర్స్ లో పడగలుగుతున్నది.మనం సాధారణంగా పడడమే గగనం అలాంటిది అనూష తన మేధోశక్తి తో చిన్ననాటి నుంచి స్కూల్ లో పాటలు, అలవాటు చేసుకొని ఆలా మొదలు పెట్టి ఈరోజు వరకు ఎన్నో పాటలు పడుతుంది. అనూష కు ఒక పాపకూడ ఉంది సొంత ఇల్లు లేక అద్దె ఇంటిలో జీవనం సాగిస్తుంది. అనూష భర్తకు వచ్చే పింఛన్ డబ్బులతో కాలం వెల్లదీస్తున్నామని న్యూస్ 18 తెలుగు ఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. దాతలు కానీ, ప్రభుత్వం గాని ఏదయినా ఉపాధి చూపిస్తే చేసుకొని బ్రతుకుతామని అంటోంది.

ప్రత్యేక టాలెంట్ ఉండి కూడా సరైన అవకాశాలు రాని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేని దివ్యాంగుల కోసం బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ పనిచేస్తోంది. శాంతి రాఘవన్ అనే మహిళ 2004 సంవత్సరంలో ఎనేబుల్ ఇండియా అనే సంస్థను ప్రారంభించారు. ఆమె దివ్యాంగులు ముఖ్యంగా అంథుల మీద బాగా స్టడీ చేశారు. దివ్యాంగులు 275 రకాల ఉద్యోగాలు చేయగలరని గుర్తించారు. దివ్యాంగుల్లో ఉందే ఆత్మన్యూనత భావాన్ని పోగొట్టడం, వారిపై వారికి నమ్మకం కలిగించేలా కార్యక్రమాలను రూపొందించారు. కొన్ని కారణాల వల్ల చదువు మానేసిన వారికి కూడా ఈ సంస్థలో పలు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గాలు చూపిస్తుంది. అక్కడ శిక్షణ ఇచ్చేవారు కూడా దివ్వాంగులే ఉంటారు. తీవ్ర అంగవైకల్యం ఉన్నా కూడా వారు సాధించగలరనే నమ్మకాన్ని కల్పిస్తోంది. 14 రకాల వైకల్యాలు ఉన్నవారికి తీర్ఫీదు ఇస్తున్నారు.


ఈ సంస్థ దేశంలోని 28 రాష్ట్రాల్లో పనిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంస్థ చురుగ్గా పనిచేస్తోంది. విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో డిజిటల్ లిటరసీ ల్యాబ్ ఏర్పాటు చేసింది. విజయామేరీ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అంథులకు ప్రయోగశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సంస్థ ద్వారా 2.20 లక్షలకు పైగా లబ్ధి పొందారు. తెలుగు రాష్ట్రాల్లో 2వేల మందికి పైగా దివ్యాంగులు లబ్ధి పొందారు. 600 మంది ఉద్యోగాలు సాధించారు. ఎల్వీ ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్, అనంతపూర్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌తో కలసి పనిచేస్తున్నారు. స్వయం ఉపాధి, నైపుణ్యాలు పెంచుకోవాలనుకునే దివ్యాంగులు ఎవరైనా ఈ సంస్థను ఆశ్రయించవచ్చు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 7, 2020, 10:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading