Home /News /telangana /

A 65 YEAR OLD MAN MADE A 14 YEAR OLD GIRL PREGNANT IN TELANGANA VB

Rape on minor: 65 ఏళ్ల వృద్ధుడు.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Rape on minor: కామంతో కళ్లు మూసుకుపోతే చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా కనిపించదు. మృగాళ్లుగా మారి దారుణాలకు ఒడిగడుతున్నారు. 14 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. మనువరాలి వయస్సున్న బాలికపై అత్యాచారం చేసి కామ వాంఛ తీర్చుకున్నాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి ...
    ఆ బాలికకు వరుసకు తాతయ్య అవుతాడు. వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతీ రోజు ఆ బాలిక అతడితో వెళ్తుంది. రోజూ పనులు ముగించుకొని ఇంటికి వస్తారు. ఆ బాలిక తల్లిదండ్రులు కూలికి వెళ్తుంటారు. ఇలా ప్రతి నిత్యం జరుగుతుంది. అయితే 65 ఏళ్ల వయసున్న వృద్ధుడు ఆ బాలికపై ఓ రోజు అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన బాలికకు అనార్యోగ్యంతో బాధపతుండగా తల్లిదండ్రులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. జ్వరం విపరీతంగా ఉండటంతో షాద్ నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులను సంప్రదించారు. అయితే వాళ్లు చెప్పిన సమాధానం వారికి షాక్ గురయ్యేలా చేసింది. ఆమె గర్బవతి అని వైద్యులు చెప్పారు. ఆ బాలిక దగ్గరకు వెళ్లి ఎలా జరిగిందని ఆరా తీయగా విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో ఆ వృద్ధుడి విషయం బయటకు వచ్చింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు కేసు నమోదు చేశారు. ఈ ఘటన షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

    షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఓ బాలిక(14)కు వరుసకు బంధువు అయిన వృద్ధుడితో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్తుండేది. తాత, మనువరాళ్లు పనులు ముగించుకొని ఇంటికి వచ్చేవారు. ఓ రోజు ఇలాగే గ్రమ శివారు పొలంలోకి బాలికను తీసుకెళ్లిన వృద్ధుడు బాలికపై అత్యాచారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు ఆమె గర్భం దాల్చినట్లు చెప్పారని పోలీసులు తెలిపారు.

    ప్రతీకాత్మక చిత్రం


    దీంతో వృద్ధుడి విషయం బయటపడిందన్నారు. 65ఏళ్ల వృద్ధుడు 14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన వృద్ధుడిపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Minor girl, Old man, Rape on minor, Shadnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు