Minor Girl: ఎంత దారుణం అంటే.. అతడికి 50 ఏళ్లు.. బాలికకు 3 ఏళ్లు.. చాక్లెట్ ఆశ చూపి..

స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబసభ్యులు

Minor Girl: కామంతో కళ్ళు మూసుకుపోయి ఐదు పదుల వయసులో ఉన్న వ్యక్తి చాక్లేట్ ఆశ చూపి అభం శుభం తెలియని ఓ మూడేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    (K.Lenin,News18,Adilabad)

    కామంతో కళ్ళు మూసుకుపోయి ఐదు పదుల వయసులో ఉన్న వ్యక్తి చాక్లేట్ ఆశ చూపి అభం శుభం తెలియని ఓ మూడేళ్ళ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై పోక్సో తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే విషయం తెలిసిన బాలిక బంధువులు నిర్మల్ పట్టణంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఇలా ఉన్నాయి.

    Fifty Students: ఇతడు ఎంత ముదురో తెలుసా.. చదువుకొమ్మని పంపిస్తే.. 50 మంది విద్యార్థినులతో ఇలా..


    నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాం ప్రాంతం లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వెనుక వైపు కాలనీలో మూడు సంవత్సరాల బాలికపై యాభై సంవత్సరాల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధితురాలి బంధువులు పోలీసు స్టేషన్ ను ముట్టడించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్మల్ పట్టణంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక ప్రాంతంలో యాభై సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మైనర్ బాలికపై నిన్న సాయంత్రం లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచార యత్నం చేశాడు.

    ఆమె నిద్రలేచి చూసే సరికి తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయం తెలియలేదు.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..


    బాలికను పరిశీలించిన తల్లి విషయాన్ని అడగగా బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో అత్యాచార యత్నం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలి కుటుంబీకులు, బంధువులు, కాలనీవాసులు అర్ధరాత్రి నిర్మల్ పట్టణ పోలీసు స్టేషన్ కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ ముందు వైపు నుండి వెళుతున్న ఒక అంబులెన్స్ పై ఆందోళనకారులు దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ సందర్బంగా బాధితురాలి తల్లి మాట్లాడుతూ నిన్న ఇంటి దగ్గర మా కూతురుతో పాటు మరో ఇద్దరు బాలికలు ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి తమ కుమార్తెకు చాక్లెట్ ఇస్తానని మాయ మాటలు చెప్పి అత్యాచార యత్నం చేశాడని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

    Hyderabad Crime: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. అత్యంత దారుణంగా..


    కాగా బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ రామ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. నిందితునిపై పోక్సో తో పాటు పలు సెక్షన్ల కేసులు కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకొని న్యాయం చేస్తామని తెలిపారు. ఎవరు కూడా ఆందోళనకు దిగవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
    Published by:Veera Babu
    First published: