కేటీఆర్‌కి తొమ్మిదో తరగతి విద్యార్థి ట్వీట్.. రియాక్షన్ ఏంటంటే..

‘సర్ మీరు ఎండల దృష్ట్యా సెలవులు పొడిగించారు. కానీ మా స్కూల్ ఆ విషయం పట్టించుకోకుండా స్కూల్ రన్ చేస్తోంది. దీంతో ఎండల్లో జర్నీ చేయలేకపోతున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ రీట్వీట్ చేశారు.

news18-telugu
Updated: May 28, 2019, 10:32 AM IST
కేటీఆర్‌కి తొమ్మిదో తరగతి విద్యార్థి ట్వీట్.. రియాక్షన్ ఏంటంటే..
కేటీఆర్‌కి తొమ్మిదోతరగతి విద్యార్థి ట్వీట్
news18-telugu
Updated: May 28, 2019, 10:32 AM IST
పెరిగిన ఎండల దృష్ట్యా వేసవి సెలవులను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినా.. ఈ నిబంధనలు పట్టించుకోకుండా ఉప్పల్‌లో ఓ స్కూల్ యాజమాన్యం తరగతులు నడిపిస్తుండడంతో.. ఆ స్కూల్‌లో చదివే విద్యార్థి స్వయంగా కేటీఆర్‌కి ట్వీట్ చేసింది. ‘సర్ మీరు ఎండల దృష్ట్యా సెలవులు పొడిగించారు. కానీ మా స్కూల్ ఆ విషయం పట్టించుకోకుండా స్కూల్ రన్ చేస్తోంది. దీంతో ఎండల్లో జర్నీ చేయలేకపోతున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ రీట్వీట్ చేశారు.

వేసవి సెలవుల పొడిగింపుని ప్రతీ విద్యాసంస్థ అమలుపరిచేలా చూడాలని విద్యాశాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తూ రీ ట్వీట్ చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థి సమస్యని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం.. వెంటనే కేటీఆర్ స్పందించడంతో.. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. విద్యార్థులను సపోర్ట్ చేస్తూ చాలా మంది స్పందిస్తే.. కేటీఆర్ వెంటనే యాక్షన్ తీసుకోవడాన్ని మరికొంతమంది మెచ్చుకుంటూ ట్వీట్స్ చేసేస్తున్నారు.First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...