హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy: కాలుష్యంతో అల్లాడిపోతున్నాం.. హైకోర్టు జడ్జికి 9వ తరగతి విద్యార్థి లేఖ

Sangareddy: కాలుష్యంతో అల్లాడిపోతున్నాం.. హైకోర్టు జడ్జికి 9వ తరగతి విద్యార్థి లేఖ

హైకోర్టుకు లేఖరాసిన విద్యార్థి సిద్దార్థ

హైకోర్టుకు లేఖరాసిన విద్యార్థి సిద్దార్థ

Sangareddy: ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినా నామమాత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. చేసేదేమీ లేక స్కూల్ విద్యార్థి సిద్ధార్థ  హైకోర్టు జడ్జికి ఫిర్యాదు చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(కే, వీరన్న, న్యూస్ 18 తెలుగు, మెదక్ )

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచునూరు గ్రామ శివారులోని నాలుగు రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంతో గ్రామస్తులతో పాట విద్యార్థులు  ఉక్కిరిబ్కిరవుతున్నారు. ఘాటైన వాసనలకు ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది. గ్రామస్థులతో పాటు ఇక్కడి మోడల్ స్కూల్ విద్యార్థులు పరిశ్రమల నుంచి వెలువడు తున్న ఘాటైన వాసనలతో అస్వస్థతకు గురవుతున్నారు. తలనొప్పి పాటు భవిష్యత్తు ఊపిరితిత్తుల బాధపడే అవకాశాలు కనబడుతున్నాయని విద్యార్థులు న్యూస్ 18తో తెలిపారు. ఎన్నిసార్లు పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినా నామమాత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపించారు. చేసేదేమీ లేక స్కూల్ విద్యార్థి సిద్ధార్థ  హైకోర్టు జడ్జికి ఫిర్యాదు చేశాడు. కాలుష్యం కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ విద్యార్థి రాసిన ఈ లేఖను హైకోర్టు వ్యాజ్యంగా స్వీకరించింది.

గుండ్లమామునూర్ గ్రామంలోని మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది.   ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య 497. ఇంటర్మీడియట్ లో మొత్తం 174 మంది స్టూడెంట్స్ ఉన్నారు.    సంగారెడ్డి జిల్లాలోని హత్నూర, కంది, సంగారెడ్డి మండలాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు నిత్యం వచ్చి పోతుంటారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉన్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే విషవాయువులతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చేతి రుమాళ్లను మూతికి అడ్డుపెట్టుకొని నడువాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం మాస్కులు ధరించి బోధిస్తున్నారు.

Hyderabad | Hawala money: కోటి రూపాయల హవాలా మనీ సీజ్ .. తెరపైకి కోమటిరెడ్డి పేర్లు

ప్రతీ ఏటా పాఠశాల ప్రారంభ సమయంలో విద్యార్థులు పూర్తిస్థాయిలో జాయిన్ అవుతున్నా.. కాలుష్యం వల్ల నెలల వ్యవధిలోనే పలువురు మానేస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అనేకమంది విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతూ ఇళ్ల వద్దే ఉండిపోతున్నారని తెలిపారు.సెప్టెంబర్ ఆరో తేదీన పిసిబి అధికారులు వచ్చి వచ్చి మొక్కుబడిగా తనిఖీలు చేశారని గ్రామస్తులు వాపోయారు. పీసీబీ అధికారులు వచ్చే ముందు పరిశ్రమలకు ముందే ఇంటిమేషన్ ఇస్తున్నట్లు అక్కడున్న తెలిపారు. ఆ రెండు రోజులు మాత్రం ఎలాంటి కాలుష్య పదార్థాలు వదలకుండా చూస్తారు. ఆ తర్వాత మళ్లీ రసాయనాలను విడుదల చేస్తారు.

పీసీబీ అధికారులు పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పరిసర గ్రామాల ప్రజల ప్రాణా లతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పరిశ్రమలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోకపోవడంతో మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కె. సిద్ధార్థ జిల్లా కలెక్టర్‌తో పాటు హైకోర్టు జడ్జికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిని హైకోర్టు ధర్మాసనం సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. 600 మంది విద్యార్థులను వేధిస్తున్న సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదే శించింది. ఈ మేరకు హైకోర్టు విద్యాశాఖ, రెవెన్యూ, హోం, పరిశ్రమలు వాణిజ్యశాఖల ముఖ్యకార్యదర్శులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సంగారెడ్డి కలెక్టర్, డీఈవోలకు నోటీసులు జారీచేసింది. News 18 తో విద్యార్థి సిద్ధార్థ మాట్లాడుతూ..  దుర్వాసనతో కాలుష్యం వల్ల అన్నం తినలేక పోతున్నాను అని చెప్పాడు. భరించలేని దుర్వాసన వల్ల చదువులపై దృష్టిసారించలేకపోతున్నామని తెలిపాడు.

First published:

Tags: Sangareddy, Telangana High Court

ఉత్తమ కథలు