• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • 9 MONTH WOMB OF A LADY DISAPPEARED WITHIN NIGHT IN GADWAL SK

9 నెలల గర్భం మాయం.. దేవుడి పనంటున్న మహిళ.. డాక్టర్లు షాక్

9 నెలల గర్భం మాయం.. దేవుడి పనంటున్న మహిళ.. డాక్టర్లు షాక్

బాధిత మహిళ

ఆమె నిండు కడుపుతో ఉన్న మాట వాస్తమని.. మా కళ్లతో మేము చూశామని ఆశా వర్కర్లు చెబుతున్నారు. అసలు గర్భం ఎలా మాయమైందో అర్ధం కావడం లేదని చెప్పారు.

  • Share this:
    ఓ మహిళకు రాత్రికి రాత్రే గర్భం మాయమైంది. ఆస్పత్రికి వచ్చినప్పుడు కనిపించిన 9 నెలల గర్భం.. తెల్లారేసనికి అదృశ్యమై ఈ విచిత్ర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడ్ మండలంలో చోటుచేసుకుంది. బాధిత మహిళ, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన మానస మంజుల (25)కు ఆరేళ్ల క్రితం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేష్‌తో వివాహం జరిగింది. కానీ అప్పటి నుండి ఆమె గర్భం దాల్చలేదు. గత ఏడాది గర్భం నిలబడడంతో ప్రతి నెల ఆశా వర్కర్ల సహాయముతో మానోపాడు పిహెచ్‌సిలో పరీక్షలు చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె 9 నెలల నిండు గర్భిణి. ఈ క్రమంలో శనివారంబ ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి PHCకి వచ్చింది. ఐతే ఆమెకు పూనక రావడంతో వైద్య సేవలకు నిరాకరించింది. తనను మౌలాలి సాహెబ్ దేవుడు ఆవహించడాని, ఆస్పత్రికి తీసుకెళ్ల వద్దని కేకలు పెట్టింది. దాంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఇంటికి తీసుకెళ్లారు.

    ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి ఉదయం లేచి చూసే సరికి ఆమె గర్భం మాయమైంది. దాంతో కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల స్థానికులు షాక్ అయ్యారు. ఐతే ఆమె మాత్రం తెల్లవారు జామున మౌలాలి స్వామి వచ్చి తన బిడ్డను తీసుకెళ్లాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కడుపులో ఉన్న బిడ్డ ఏమయ్యాడో తెలియక.. కుటుంబ సభ్యులు హటాహుటిన ఆమెను మరోసారి మానోపాడు PHCకి తీసుకెళ్లారు. మంజులను చూసి డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్ తిన్నారు. ముందు రోజు రాత్రి ఆమెకు గర్భం ఉన్నదని.. కానీ ఇప్పుడు కనబడడం లేదని ఏఎన్ఎం, ఆశా వర్కలు చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలియడంతో డాక్టర్ దివ్య ఆస్పత్రికి చేరుకొని ఆమెను పరిశీలించారు. ఆమె కడుపుతో ఉన్నప్పుడు పరీక్షలను తాను చేశానని.. కానీ ఇప్పుడు కడుపు కనిపించడం లేదని చెప్పారు. ఆమె డెలివరీ అయ్యినట్లు, అబార్షన్ చేయించుకున్నట్లు కూడా ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదని తెలిపారు.

    స్కానింగ్ చేస్తే తప్ప అసలు ఏం జరిగిందో తెలియదని డాక్టర్ చెప్పారు. ఐతే దేవుడు ఆవహించాడనే విషయం అవాస్తవమని.. స్కానింగ్ రిపోర్టును బట్టి నిజాలు తెలుస్తాయని తెలిపారు. మరోవైపు ఆమె నిండు కడుపుతో ఉన్న మాట వాస్తమని.. మా కళ్లతో మేము చూశామని ఆశా వర్కర్లు చెబుతున్నారు. అసలు గర్భం ఎలా మాయమైందో అర్ధం కావడం లేదని చెప్పారు. తల్లిదండ్రులు, భర్త కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు