Home /News /telangana /

843 CASES HAVE BEEN REGISTERED AGAINST PRIVATE HOSPITALS IN TELANGANA FOR CHARGING HIGH FEES FROM CORONA VICTIMS BK PRV

Private Hospitals: తెలంగాణలో ప్రైవేట్​ ఆస్పత్రుల ఆగ‌డాలు.. ఏడాదిలోనే 843 అధిక చార్జీల కేసులు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రైవేట్ ఆసుప‌త్రుల ఆగాడాల‌కు మ‌రో నిద‌ర్శనం. ప్ర‌జా ఆరోగ్యాల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌ని ద్రాక్ష చేశారు అన‌డానికి ఇదో సాక్ష్యం.  బాధితుల నుంచి అధిక చార్జీలు డిమాండ్ చేసింద‌న‌కు న‌గ‌రంలో ప‌లు ఆసుప‌త్రుల‌పై కోవిడ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 843 కేసులు న‌మోదైయ్యాంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఇంకా చదవండి ...
    (Balakrishna, News 18)

    ప్రైవేట్ ఆసుప‌త్రుల (private hospitals) ఆగాడాల‌కు మ‌రో నిద‌ర్శనం. ప్ర‌జా ఆరోగ్యాల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌ని ద్రాక్ష చేశారు అన‌డానికి ఇదో సాక్ష్యం.  బాధితుల నుంచి అధిక చార్జీలు డిమాండ్ చేసింద‌న‌కు న‌గ‌రంలో ప‌లు ఆసుప‌త్రుల‌పై కోవిడ్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 843 కేసులు (Cases) న‌మోదైయ్యాంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను పాటించ‌పోవ‌డమే కాకుండా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన చికిత్స ఛార్జీలపై ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు నమోదయ్యాయి.   కోవిడ్ (Corona) సమయంలో ప్రభుత్వం RT PCR సహా వివిధ పరీక్షల ధరను నిర్ణ‌యించింది అయితే వీటిని హైదరాబాద్​ (Hyderabad) న‌గ‌రంలో ఉన్న కొన్ని ప్రైవేట్ ఆసుప‌త్రులు ప‌ట్టించుకోకుండా త‌మ‌కు న‌చ్చిన రేట్లు బాధితుల‌పై రుద్దారు.  ఇలా ప్ర‌వ‌ర్తించిన కొన్నిప్రైవేట్ ఆసుప‌త్రుల‌పై ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేసింది. ఇలా కేసులు న‌మోదు చేసిన ఆసుప‌త్రుల్లో పలు ప్ర‌ముఖ ఆసుప‌త్రులు కూడా ఉండ‌డం విశేషం.

    ఇలా వ‌చ్చిన‌ ఫిర్యాదులలో ఎక్కువ భాగం  ప్రైవేట్ ఆసుపత్రులు అదనపు ఛార్జీలకు (additional charges) సంబంధించినవి ఉండ‌గా నాలుగు కేసులు వైద్య నిర్లక్ష్యానికి సంబంధించినవి, ఒకటి పారిశుద్ధ్య లోపం మరియు కోవిడ్-19 ప్రోటోకాల్‌లను (Covid Protocal) పాటించకపోవడానికి సంబంధించినవి కేసులున్నాయి.

    నిర్లక్ష్యంపై ఫిర్యాదులు..

    గచ్చిబౌలిలోని (Gachibowli) టిమ్స్‌, హస్తినాపురంలోని రైజ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ , నల్లకుంటలోని డాక్టర్‌ హైరెన్స్‌ డయాబెటిక్‌ థైరాయిడ్‌ అండ్‌ జెనరిక్‌ క్లినిక్‌ , కొత్తపేటలోని ఓమ్నీ హాస్పిటల్‌ లో వైద్య నిర్లక్ష్యంపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లోని (Adilabad) నక్షత్ర హాస్పిటల్స్‌లో పారిశుధ్య సమస్య నమోదైంది. కోవిడ్ స‌మ‌యంలో ఆసుపత్రులు అదనపు బిల్లులు వసూలు చేస్తున్నాయని చాలా మంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రజలు ఆసుపత్రుల్లో బెడ్లు ఇతర సేవల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

    ప్ర‌భుత్వం ధ‌ర‌లు నిర్ణ‌యించిన‌ప్ప‌టికి..

    ఒక‌నోక ద‌శ‌లో ప్రభుత్వ ఆసుపత్రులలొ (Government hospitals) సౌకర్యాలు లేకుండా పోయాయి. దీంతో చాలా మంది ప్రైవేట్ ఆసుప‌త్రుల వైపు వెళ్లారు. దీంతో వారు ప్ర‌భుత్వం ధ‌ర‌లు (Government prices) నిర్ణ‌యించిన‌ప్ప‌టికి వారికి నచ్చిన‌ట్లు ధ‌ర‌లు వ‌సూలు చేశారు. అందుకే ఈ ఆసుపత్రులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలుసుకోవడానికి   RTI  పిటిషన్​ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నాన‌ని న్యూస్ 18 కి తెలిపారు మహమ్మద్.

    అయితే ఇంకా చాలా ఆసుప‌త్రుల విష‌యంలో ప్ర‌భుత్వం (Government) చూసిన చూడ‌న‌ట్లు వ్య‌వ‌హారించింద‌ని ఆరోపిస్తోన్నారు మ‌హ‌మ్మ‌ద్. కోవిడ్ స‌మ‌యంలోనే కాదు సాదార‌ణ స‌మ‌యాల్లో కూడ అధిక చార్జీల‌తో ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెడుతున్న ఆసుప‌త్రుల‌పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైధ్యం అందరికి అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని త్వరలో ఇందుకు సంబంధించి పోరాటం చేస్తానని మహమ్మద్ అంటున్నారు .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cases, Covid hospital, Hospitals, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు