హోమ్ /వార్తలు /తెలంగాణ /

80 శాతం నీరు...20 శాతం ఇంధనంతో నడిచేకారు...తెలుగు శాస్త్రవేత్త అద్బుత సృష్టి

80 శాతం నీరు...20 శాతం ఇంధనంతో నడిచేకారు...తెలుగు శాస్త్రవేత్త అద్బుత సృష్టి

సుందర్ వాటర్ ఫ్యుయల్ టెక్నాలజీ

సుందర్ వాటర్ ఫ్యుయల్ టెక్నాలజీ

పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు మనం చూశాం. వాటికి ప్రత్యామ్నాయంగా ఉండే నీటితో నడిచే వాహనాలూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గుంటూరు చెందిన ప్రొ. సుందరరామయ్య.

  రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డిజిల్ ధరలను తలుచుకొని మనలో ఎవ్వరికైన ఒక్కసారైన అనిపించి ఉంటుంది. నీటితో నడిచే వాహనాలు అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది.? వినేందుకు వింతగా ఉంది కదూ.! అవును ఆ రోజులు కూడా వచ్చేశాయ్ అంటున్నారు ఓ యువ శాస్త్ర వేత్త. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు మనం చూశాం. వాటికి ప్రత్యామ్నాయంగా ఉండే నీటితో నడిచే వాహనాలూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గుంటూరు చెందిన ప్రొ. సుందరరామయ్య. పర్యావరణ శాస్త్ర వేత్త 'సుందరరామయ్య'. తనకు వచ్చిన ఆలోచనను తొమ్మిదేళ్లపాటు కష్ట పడి నిజం చేశారు. సాధారణ అవసరాలకు వాడే నీటితోనే వాహనాలను నడపోచ్చు అంటున్నారు ఈయన, ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నింటికి ఆధారం నీరు అలాంటప్పుడు నీటితో నడిచే కారు ఎందుకు తయారు చేయకుడదు అన్నారు సుందర్ అలా పుట్టిన ఆలోచనే ఈ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా నడిచే కారు. అయితే ఈ విధానం ద్వారా పూర్తిగా నీరుతో హహానాలు నడవవు 20 శాతం ఇంధనం 80 శాతం నీరుతో వాహానాలు నడిపే విధానాన్ని కనిపెట్టారు సుందర్.

  నీరు అంటే సాంకేతిక బాషాలో హెచ్ టూ ఓ ఆక్సిజన్, హెడ్రోజన్ మిశ్రమమే నీరు....అలాంటప్పుడు నీటి నుంచి హెడ్రోజన్ ను వేరు చేసి ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదు అన్నారు సుందర్ . ఇందుకోసం తొమ్మిదేళ్లు కృషి చేసిన సుందర్ చివరకు నీటితో వాహానాన్ని నడిపే పరికరాన్ని కనిపెట్టారు. ప్రతి వాహానానికి ఈ పరికరాన్నిఏర్పాటు చేస్తాం. వాటర్ హెడ్రోలసిస్ అనే థెరఫీ ద్వారా హెడ్రోజ్ తయారు అవుతుంది. అలా తయారు అయిన హెడ్రోజ్ ఇంజన్ లోకి వెళ్లీ కంప్రెస్ అవుతుంది. ఇలా ఇంజన్ నడవడానికి హెడ్రోజన్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు వాహానాల మైలీజీ కూడా ఈ పరికరంతో పెంచొచ్చు అంటున్నారు సుందర్. ఒక లీటర్ వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ అనేది డైరెక్టుగా కంబషన్ చాంబర్ లోకి తీసుకువెళ్ళి క్రయోజనిక్ ఇంజన్ ను ఏ విధంగా అయితే రాకెట్ వేగవంతంగా దూసుకుపోతుందో సేమ్ ప్రాసెస్ లో మెకానికల్ కంబషన్ ఇంజన్ లో ఈ హైడ్రోజన్ మనం ఫ్యూయల్ ఉపయోగపడుతుంది. దీంతో వాహాన మైలేజీ కూడా పెంచొచ్చు.

  ఇలా నీటితో ఇందన వ్యయాన్ని తగ్గించడం వలన పర్యావరణానికి కూడా మేలు చేసినట్లు అవుతొందంటున్నారు సుందర్.. ముఖ్యంగా రోజు రోజుకి పెరుగుతున్న వాహానాల సంఖ్య వాటి ద్వార విడుదలైన కార్బడైక్సైడ్ వలన పర్యావరణానికి చేటు చేస్తోంది ఈ నేపథ్యంలో నీటితో నడిచే వాహానాల కేవలం ఆక్సిజన్ మాత్రమే బాహ్య ప్రపంచలోకి విడుదల చేస్తాయి దీంతో పర్యావరణానికి మేలు చేసే విధంగా కూడా ఉంటుందని సుందర్ తెలిపారు.

  మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో నీటితో నడిచే కారును రూపోందించబోతున్నామన్నారు సుధర్. నీటి నుంచి హెడ్రోజన్ వేరు చేయడం అనేది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అయినప్పటికి చాలా రిస్క్ తో కూడిన ప్రయోగం చేస్తోన్నామం అన్నారు సుదర్. ఇప్పటికే మేము తయారు చేసిన ప్రొడెక్ట్ ని అన్ని పెద్ద పెద్ద సంస్థలకు చూపించాం జీఎంఆర్ లాంటి సంస్థలు కూడా మాకు అవకాశం కల్పించారు. అయితే ఇక్కడ ఒక్క చిన్న ఇబ్బంది తలెత్తింది...ప్రస్తుతం మేము కనిపెట్టిన సాంకేతిక విధానం చాలా ఖర్చు కూడుకున్నాది ఈ పరికరాన్ని వాహానంలో ఇన్స్టార్ చేయలాంటి దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది కారు ఖర్చే అంత ఉండనప్పుడు సామాన్యుడు కొనుక్కొలేని పరిస్తితి అందుకే ఈ ప్రొడెక్ట్ ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాం అన్నారు సుందర్.

  బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి

  Published by:Krishna Adithya
  First published:

  Tags: CAR, Technology, VIRAL NEWS

  ఉత్తమ కథలు