హోమ్ /వార్తలు /తెలంగాణ /

చిన్నారి ప్రాణంతీసిన చాక్లెట్.. తల్లిదండ్రులూ మీ పిల్లలు జాగ్రత్త

చిన్నారి ప్రాణంతీసిన చాక్లెట్.. తల్లిదండ్రులూ మీ పిల్లలు జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రాణం. వారి ఆనందం కోసం చాక్లెట్లూ, చిరుతిళ్లూ ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన చాక్లెట్టే.. ఆ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదన మిగిల్చింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పిల్లలు అల్లరి చేస్తే.. వారికి చాక్లెట్లు కొనిపెట్టడం తల్లిదండ్రులకు అలవాటు. ఐతే.. అవి పెద్దగా ఉంటే ప్రమాదం. అలాంటి చాక్లెట్టే ఓ చిన్నారి ప్రాణం తీసింది. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్‌ సింగ్‌ 20 ఏళ్ల కిందట వరంగల్‌కి వలస వచ్చాడు. జేపీఎన్‌ రోడ్డులో ఎలక్ట్రికల్‌ షాపు పెట్టుకొని ఫ్యామిలీతో హాయిగా జీవిస్తున్నాడు. సింగ్‌కి భార్య గీత, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లైన్‌లో ఉంటోంది ఈ ఫ్యామిలీ. ఈ మధ్య వ్యాపార కార్యకలాపాల కోసం సింగ్.. ఆస్ట్రేలియా వెళ్లాడు. రిటర్న్ వస్తూ.. అక్కడ దొరికే ప్రత్యేక ఖరీదైన చాక్లెట్లను పిల్లల కోసం ప్రేమగా తెచ్చాడు.

తాజాగా సింగ్ రెండో కొడుకైన 8 ఏళ్ల సందీప్.. స్కూల్‌కి వెళ్తుండగా.. తల్లి గీత చాక్లెట్లు ఇచ్చింది. వాటిని తింటూనే.. మిగతా పిల్లలతో కలిసి స్కూల్‌కి వెళ్లాడు. ఈ చిన్నారి శారదా పబ్లిక్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కి వెళ్లాక.. టీచర్ లెసన్ చెబుతుంటే.. సందీప్ నిద్రపోతున్నట్లుగా కనిపించాడు. టీచర్ తనను కదపగా.. కదల్లేదు. స్పృహ తప్పినట్లు ఉన్నాడు. వెంటనే సందీప్ తండ్రిక్ కాల్ చేశారు. బైక్‌పై వచ్చిన తండ్రి.. వెంటనే సందీప్‌ని ఎంజీఎం హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు.

Crime : మరో శ్రద్ధావాకర్.. ఆఫ్తాబ్.. ఇది విదేశాల్లో జరిగిన ప్రేమ హత్య

అప్పటికే సందీప్ పరిస్థితి విషమంగా మారింది. బ్రెయిన్‌కి ఆక్సిజన్ సరఫరా బాగా తగ్గిపోయింది. చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోవడం వల్లే ఇలా జరిగింది. డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తుండగా.. సందీప్ చనిపోయాడు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన ఆ కుటుంబం.. శనివారం సాయంత్రం సందీప్‌‌కి అంత్యక్రియలు జరిపింది. ఇలా.. ప్రేమగా ఇచ్చిన చాక్లె్ట్టే ప్రాణం తీసింది.

మన ఇళ్లలో కూడా పిల్లలు ఏవేవో తింటూ ఉంటారు. స్కూల్‌కి వెళ్లాక.. వాళ్లు ఏయే చిరుతిళ్లు కొనుక్కుంటారో మనకు తెలియదు. ఏది తిన్నా బాగా నమిలి తినాలనీ.. చిన్న చిన్న ముక్కలు నోట్లో పెట్టుకోవాలని మనమే వాళ్లకు మరీ మరీ చెప్పాలి. సందీప్ సంగతే చూస్తే.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బాధను తీర్చేదెవరు? ఏం చేసినా సందీప్ తిరిగిరాడు. ఆ విషాదం మాటలకు అందనిది. ఇది ప్రతి తల్లిదండ్రులనూ అలర్ట్ చేస్తోంది.

First published:

Tags: Crime, Telangana News, Telugu news, Warangal

ఉత్తమ కథలు