Home /News /telangana /

77 PERCENT OF PADDY PURCHASE ARE OVER STILL NOW REMAINING WILL BE BOUGHT SOON SAID CHAIRMAN OF CIVIL SUPPLY VRY

Hyderabad : రైతుల వద్ద చివరి గింజవరకు కోంటాం ..విపక్షాలు దుష్ప్రచారం , మారెడ్డి శ్రీనివాస రెడ్డి

 రైతుల వద్ద చివరి గింజా... కోంటాం ..విపక్షాలు దుష్ప్రచారం ..

రైతుల వద్ద చివరి గింజా... కోంటాం ..విపక్షాలు దుష్ప్రచారం ..

Hyderabad :తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగొళ్లతో పాటు ఇతర అంశాలపై పౌరసరఫరాల సంస్థ చైర్మణ్ మారెడ్డి శ్రీనివాస రెడ్డి సమీక్ష నిర్వహించారు.రైతుల వద్ద చివరి గింజవరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన ఈ సంధర్భంగా హామి ఇచ్చారు..నిర్ధేశిత లక్ష్యంలో ఇప్పటికే 77 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...
    ఈ సంధర్బంలోనే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. ఇతర అవసరాలకు పోను రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పారు. మొత్తం రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని అయితే అందులో ఇప్పటికే 77 శాతం మేర కొనుగోళ్లు జరిగాయని చెప్పారు..కాగా గత ఏడాది ఇదే సమయానికి 52.73 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఈ ఏడాది 60.50 లక్షల మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 8లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేయడం జరిగింది, ఇంకా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని వివరించారు.

    మిగతా ధాన్యం నిర్ణీత గడువులోగా కొనుగోలు చేస్తామని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.ధాన్యం కొనుగోళ్ల సంధర్భంగా సుమారు 9 లక్షల మంది రైతులకు రూ.11,500 కోట్ల చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. బ్యాంకుల్లో ఉత్పన్నమవుతోన్న సాంకేతిక లోపాల వల్ల రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడంలో కొంచెం ఆలస్యమవుతుందని అంతే తప్ప మరో సమస్య లేదని చెప్పారు.చివరి గింజ వరకూ కొంటాం..దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని మారెడ్డి స్పష్టం చేశారు. ఇక రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకూ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. రైతాంగం ఆందోళన చెందొద్దని అన్నారు. దళారీలకు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు.

    అయితే ఇది ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మారెడ్డి ఆక్షేపించారు. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ పౌర సరఫరాల భవన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి ఐటీ, విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్షించారు. యాసంగి మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల తీరు, లోపాలు, ఎదురవుతోన్న ఇబ్బందులు, నగదు చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: PADDY PROCUREMENT, Telangana

    తదుపరి వార్తలు