Late Marrige : లేటు వయస్సు వరుడికి.. లేత వయస్సు వధువు....! కారణం ఇదే.. అంటున్న జంట

Late Marrige : లేటు వయస్సు వరుడికి.. లేత వయస్సు వధువు....! కారణం ఇదే.. అంటున్న జంట

Late Marrige : ఏడు పదుల వయస్సులో వృద్దున్ని.. మూడు పదుల వయస్సు కూడా దాటని ఓ మహిళ వివాహం చేసుకుంది. ఇక కుటుంబ సభ్యులు సైతం సినిమా స్టైల్లో వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో పెళ్లికి వయసుకి సంబంధం లేదని ఆ జంట నిరూపించారు.

 • Share this:
  సాధారణంగా పెళ్లిల్లు ఎక్కువ శాతం వయస్సు మీద ఆధారపడి కొనసాగుతాయి.. అందుకే యువతి యువకులు యవ్వనంలోనే పెళ్లిలు చేసుకుంటారు. ఎందుకంటే వయస్సు మీద పడిన తర్వాత పెళ్లిళ్లు కుదరడం అనే చాలా కష్టంగా మారుతోంది. మరోవైపు భార్య భర్తల మధ్య వయస్సు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇద్దరి మధ్య రెండు లేదా మూడు సంవత్సరాల వయస్సు తేడాతో పెళ్లిలు జరుగుతాయి.. దీంతో పెళ్లి అనేది ప్రాధమికంగా వయస్సుతో ముడి ఉంటుందనేది కాదనలేము..

  కాని కొన్ని పెళ్లిలు మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా కొనసాగుతాయి.. భార్య భర్తల మధ్య తేడా అనేక సంవత్సరాల తేడా కూడా ఉంటుంది. ఇయితే ఇలాంటీ పెళ్లిల్లు చాలా అరుదుగా కొనసాగుతుంటాయి.. ఇలా ఆదర్శంగా కొనసాగే పెళ్లిలు ప్రపంచంలో లక్షల్లో కొన్ని జంటల్లో మాత్రమే జరుగుతాయి... ఇప్పుడు తాజాగా కూడా ఇలాంటీ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏడు పదుల సంఖ్యలో వరుడు ఉంటే మూడు పదుల కూడా దాటని మహిళ వివాహం చేసుకుంది.

  ఈ క్రమంలోనే ఓ శుభకార్యంలో చూపులు కలిసిన 73 ఏళ్ల వరుడు.. 26 సంవత్సరాల వధువు ఒకటవ్వాలనుకున్నారు. దీంతో ఇరు కుటుంబీకులను ఒప్పించి మరీ పెళ్లి ( marrige ) చేసుకున్నారు. పెళ్లి విషయంలో ఇరు కుటుంబీకులు ( family ) ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు.

  ఇది చదవండి : భర్త తిన్న ప్లేటును భార్యనే.. ఎందుకు కడగాలి...? విసిరికొట్టిన భార్య.. కారణం ఇదేనంటుూ ఫైర్


  నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో ఈ వివాహం జరిగింది. అయితే ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహమే.వివరాల్లోకి వెళితే... ముథోల్‌ మండలం చింతకుంట తండాగ్రామానికి చెందిన రాథోడ్‌ కిషన్‌ ప్రభుత్వ ఉద్యోగిగా ( govt employee ) పని చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

  అందరికీ పెళ్లిళ్లయ్యాయి. కాగా బతుకుదెరువు రిత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇక కిషన్‌ భార్య గతంలో అనారోగ్యంతో మృతి చెందడంతో అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. మరోవైపు కుభీర్‌ మండలం రంజని తండా(హిప్నెల్లి)కు చెందిన సునీత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.ఈమెకు కూడా ఒక బిడ్డ ఉంది. కూలీ పనులు చేస్తూ బిడ్డను పోషించుకుంటోంది.

  ఇది చదవండి : మోహన్ బాబు ఆ విషయం ఎందుకు లేవనెత్తారు ?.. టీడీపీ వర్గాల్లో మొదలైన చర్చ


  కాగా ఇటివల ఆమె బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కిషన్‌, సునీత పరస్పరం పరిచయమయ్యారు. దీంతో వారు ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు కూడా భార్య , భర్తలను కొల్పోవడంతో ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండాలనుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. విషయాన్ని తమ తమ కుటుంబసభ్యులకు చెప్పారు. ఇక వారి పెళ్లికి కూడా కుటుంబ సభ్యులు ఎలాంటీ అభ్యంతరం చెప్పలేదు.. సినిమా తరహాలో ఇరు కుటుంబాల సభ్యులు ముందుకు వచ్చారు.. దీంతో దేగాం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో కిషన్‌, సునీత వివాహం చేసుకున్నారు.
  Published by:yveerash yveerash
  First published: