హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana రికార్డు.. ఫస్ట్ డోస్ టీకా 100% పూర్తి -కొత్తగా 7 Omicron కేసులు -228 covid కేసులు

Telangana రికార్డు.. ఫస్ట్ డోస్ టీకా 100% పూర్తి -కొత్తగా 7 Omicron కేసులు -228 covid కేసులు

ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 130, జగిత్యాల 5, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 3, కామారెడ్డి 2, కరీంనగర్ 18, ఖమ్మం 20, మహబూబ్‌నగర్ 8, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 8, మంచిర్యాల 12, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 41, ములుగు 3 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆదిలాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 130, జగిత్యాల 5, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 4, గద్వాల 3, కామారెడ్డి 2, కరీంనగర్ 18, ఖమ్మం 20, మహబూబ్‌నగర్ 8, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 8, మంచిర్యాల 12, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 41, ములుగు 3 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ మంగళవారం నాటికి 100 శాతం పూర్తయింది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా 7 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చిన నలుగురిలో, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. వివరాలివి..

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ రాష్ట్రం కీలక మైలురాయిని దాటింది. అంతుచిక్కని విధంగా రూపాలు మార్చుకుంటూ, కొత్త తరహాలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గాల్లో వ్యాక్సినేషన్ అతి ప్రధానమైనదికాగా, తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ మంగళవారం నాటికి 100 శాతం పూర్తయింది. తెలంగాణలో వ్యాక్సిన్ పొందే అర్హత గల వారికి 100 శాతం తొలి డోసు పూర్తయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఇవాళ ప్రకటించారు. వైరస్ పై పోరులో ఈ మైలురాయి ఉత్సాహాన్నిస్తోందని, అర్హులు అందరికీ రెండో డోసు కూడా పూర్తి చేసే దిశగా చర్యలు వేగవంతం చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఈ ఆనందాన్ని పాడుచేస్తూ రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకాస్త పెరిగింది..

కరోనా సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వేవ్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తెలంగాణలో పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చిన నలుగురిలో, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో తాజాగా ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు 13 మంది కోలుకున్నారు.

badminton player : అయ్యో.. ఆదిలక్ష్మి! బ్యాడ్మింటన్ యువ కెరటం చివరి మెసేజ్ కన్నీళ్లు ఆగవుఇక సాధారణ కేసుల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. తాజాగా 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

shocking : ఎలిజబెత్ రాణిని ఏసేస్తా.. సిక్కు యువకుడి సంచలన వీడియో.. అసలేం జరిగిందంటే..తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 165 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా,నలుగుగు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఎట్ రిస్క్ దేశాల ఇప్పటి వరకు 11,921 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారు.

First published:

Tags: Covid, COVID-19 vaccine, Omicron, Telangana

ఉత్తమ కథలు