గిరిజన హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్... 67మంది విద్యార్థులకు అస్వస్థత

విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు.

news18-telugu
Updated: November 24, 2019, 1:02 PM IST
గిరిజన హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్... 67మంది విద్యార్థులకు అస్వస్థత
గిరిజిన హాస్టల్‌లో కలుషిత ఆహారం
  • Share this:
నిజామాబాద్లోని గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి ఈ హాస్టల్లో సంబరాలు నిర్వహించారు. కేక్ కూడా కట్ చేశారు. అనంతరం విద్యార్థులు రాత్రి భోజనంతోపాటు పాయసం, పకోడీ తిన్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు కడుపునొప్పి బాధపడ్డారు. కొందరు వాంతులు చేసుకున్నారు. దీంతో వెంటనే వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకొని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చారు.. కలెక్టర్ రామోహన్ రావు ఉదయం ఆస్పత్రిలో పర్యటించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించి వీలైనంత త్వరగా డిశ్చార్జి అయ్యేలా చూడాలని తగినా జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు. ఈ విషయంలో గురుకుల కళాశాల నిర్వాహకుల పొరపాట్లు ఉంటే విచారణ జరిపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్యం బాగానే ఉందని వారు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.First published: November 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>