బొగ్గుగని కార్మికులకు గుడ్ న్యూస్.. దీపావళి బోనస్ ఎంతంటే..?

ప్రతిభ ఆధారిత ప్రయోజనం (పీఎల్ఆర్) కింద ఈ బోనస్‌ను అక్టోబరు 25న సింగరేణి ఖాతాల్లో జమచేయనున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 48వేల మందికి పైగా కార్మికులకు ఈ బోనస్ అందుకోనున్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 2:28 PM IST
బొగ్గుగని కార్మికులకు గుడ్ న్యూస్.. దీపావళి బోనస్ ఎంతంటే..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం గుడ్‌‌న్యూస్ చెప్పింది. ఈ దీపావళికి ఒక్కో కార్మికుడికి రూ.64,700 బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. ప్రతి ఏటా దీపావళికి ముందు కార్మికులకు బోనస్ అందించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది రూ.60వేలు బోనస్ చెల్లిచంగా ఈ సారి రూ.64,700 ఇవ్వనున్నారు. ప్రతిభ ఆధారిత ప్రయోజనం (పీఎల్ఆర్) కింద ఈ బోనస్‌ను అక్టోబరు 25న సింగరేణి ఖాతాల్లో జమచేయనున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 48వేల మందికి పైగా కార్మికులకు ఈ బోనస్ అందుకోనున్నారు. సింగరేణి యాజమాన్యం నిర్ణయంపై కార్మికుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
First published: October 23, 2019, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading