వామ్మో.. ఆ ఇంట్లో ఎన్ని పాములో.. వారేం చేశారో తెలుసా..

ఇంటిగోడలో బయటపడిన 63 పెద్ద పాములను గ్రామస్తులు చంపేశారు. అక్కడే వందకు పైగా పాము గుడ్లు కన్పించడంతో వాటినీ ధ్వంసం చేసేశారు.

news18-telugu
Updated: April 18, 2020, 6:12 PM IST
వామ్మో.. ఆ ఇంట్లో ఎన్ని పాములో.. వారేం చేశారో తెలుసా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాధారణంగా మనకు అప్పుడప్పుడే పాములు కన్పిస్తుంటాయి. అదీనూ ఒకే సమయంలో ఏ ఒక్కటో రెండు కనబడుతుంటాయి. ఇళ్ల మధ్యలోకి ఒక్క పాము వస్తేనే భయపడి పారిపోతాం. మరీ అలాంటిది ఓ ఇంట్లో ఏకంగా 63 పాములు బయటపడ్డాయి. దీంతో వారి ఇంట్లో వాళ్లే కాదు.. ఏకంగా ఊరు ఊరంతా భయపడిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామంలో కుమ్మరి భూమయ్య శుక్రవారం రాత్రి తన కుటుంబంతో కలిసి ఇంటిలో టీవీ చూస్తున్నాడు. ఆ సమయంలో పక్కనే గోడకు ఉన్న చిన్న రంధ్రం నుంచి ఓ పాము బయటికొచ్చింది. గమనించిన కుటుంబ సభ్యులు, భూమయ్య ఇరుగుపొరుగును పిలివడంతో వారు గోడను తవ్వారు. అక్కడ వారికి పాములు గుట్టలుగా కన్పించాయి. దీంతో ఒక్కసారిగా వారంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై 63 పెద్ద పాములను చంపేశారు. అక్కడే వందకు పైగా పాము గుడ్లు కన్పించడంతో వాటినీ ధ్వంసం చేసేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Published by: Narsimha Badhini
First published: April 18, 2020, 6:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading