హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!

Hyderabad: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

‘ నేను సంపాదించిన సొమ్ము. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటా. అడగడానికి మీకు హక్కు లేదు.’ అంటూ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

  అతడి వయసు 60 ఏళ్లు పైనే. పేరున్న వైద్యుడు కూడా. ఆరు నెలలు గుజరాత్ లోనూ, మరో ఆరు నెలలు హైదరాబాద్ లోనూ నివసిస్తుంటాడు. భార్యాపిల్లలతో, మనవళ్లతో ఆడుకుంటూ హ్యాపీగా గడపాల్సిన అతడికి ఇటీవలే ఓ వ్యసనం అలవాటయింది. ఆన్ లైన్ లో డేటింగ్ యాప్స్ తో చాటింగ్ చేయడం, వారితో నగ్నంగా మాట్లాడటం అతడు అలవాటుగా మార్చుకున్నాడు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఇతడి నిర్వాకాన్ని అవతలి వైపు వాళ్లు రికార్డు చేసి బెదిరిస్తే లక్షలకు లక్షలు వారికి సమర్పించుకుంటున్నాడు. ఇదేంటని నిలదీస్తే ‘ నా డబ్బు. నా ఇష్టం. నేను సంపాదించిన సొమ్మ..‘ అంటూ ఎదురుతిరుగుతున్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో రమేష్ అనే డాక్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడు గుజరాత్ రాష్ట్రంలోనూ వైద్యం చేస్తుంటాడు. ఏడాదిలో ఆరు నెలలు హైదరాబాద్ లోనూ, మరో ఆరు నెలలు గుజరాత్ రాష్ట్రంలోనూ నివసిస్తూ వైద్యం చేస్తుంటాడు. అయితే ఆరు నెలల క్రితం అతడికి ఓ డేటింగ్ యాప్ లో యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా మరింత దగ్గరయి వాట్సప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలోనే వారిద్దరూ రొమాంటిక్ చాట్ చేసుకునేవాళ్లు. చివరకు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకునేదాకా వీళ్ల వ్యవహారం వెళ్లింది. నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడిన సమయంలో ఈ డాక్టర్ నిర్వాకాన్ని ఆ యువతి రికార్డ్ చేసింది.

  ఇది కూడా చదవండి: అడ్డదారిలో కొల్లగొట్టి.. స్టార్ హోటళ్లలో జల్సాలు.. 40 రోజులకే రూ.40 లక్షల ఖర్చు.. కి’లేడీ‘ కేసులో షాకింగ్ నిజాలు..

  ఆ తర్వాత రమేష్ ను బెదిరించడం మొదలు పెట్టింది. కోరినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతాననడంతో గతేడాది నవంబర్ నెలలో విడతల వారీగా దాదాపు 39 లక్షల రూపాయలు ఆ యువతికి సమర్పించుకున్నాడు. అయినప్పటికీ ఆమె నుంచి వేధింపులు ఆగకపోవడంతో భరించలేక హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఒకటి కాదు రెండు కాదు 39 లక్షలు కోల్పోయినా ఆ వైద్యుడు మాత్రం తీరు మార్చుకోలేదు. పలు డేటింగ్ యాప్స్ లలో యువతులతో స్నేహం చేస్తున్నాడనీ, వారితో ఇంకా మాట్లాడుతున్నాడని కుటుంబ సభ్యులు గుర్తించారు. మరో 30 లక్షల రూపాయల వరకు పలువురు యువతులకు సమర్పించుకున్నాడని గ్రహించారు.

  ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..

  దీంతో అతడిని నిలదీస్తే ‘ నేను సంపాదించిన సొమ్ము. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటా. అడగడానికి మీకు హక్కు లేదు.’ అంటూ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి ఫిర్యాదు మేరకు డాక్టర్ బ్యాంకు అకౌంట్లను స్థంబింపజేశారు. ఆ విషయం తెలిసి డాక్టర్ మళ్లీ పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన అకౌంట్లను తెరిపించాలని కోరాడు. అయితే పోలీసులు మాత్రం ‘గుర్తు తెలియని వాళ్లతో ఆన్ లైన్లలో చాటింగ్ చేయననీ, మాట్లాడనని హామీ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్లను తెరిపిస్తాం‘ అని స్పష్టం చేశారు. కాగా, పోయిన డబ్బు గురించి గతంలో ఫిర్యాదు చేసిన రమేష్, పలుమార్లు ఈ విషయమై పోలీసులతో మాట్లాడాడట. ఆ డబ్బు తిరిగి వస్తుందా? అని ఆరా తీస్తున్నాడట.

  ఇది కూడా చదవండి: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Crime news, Crime story, CYBER CRIME, Dating App, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు