Dussehra Liquor Sales: ‘కిక్కు’ అదిరిపోయిందిగా.. తెలంగాణలో ఒక్క రోజే మందుబాబులు ఎంత తాగారో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Dussehra Liquor Sales: దసరా సందర్భంగా మందుబాబులు రెచ్చిపోయారు. గత రెండు సంవత్సరాల్లో లేని విధంగా మద్యం తాగేశారు. ఒక్క రోజులోనే తెలంగాణ సర్కారుకు దాదాపు రూ.200 కోట్ల ఆదాయం సమకూరింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  దసరా(Dussehra) అంటే చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగం(Job) చేసేవారందరికీ ఎంతో ఇష్టమైన పండుగ(Festival). ఎందుకంటే.. పిల్లలకు దసరా సెలవులు(Holidays) అనేవి ఏ పండగకు దొరకని విధంగా ఇస్తుంటారు. దాదాపు 9 నుంచి 12 రోజుల వరకు సెలవులు దొరుకుతాయి. ఇక కొన్ని కంపెనీలు దసరా పండక్కి వారి ఉద్యోగులకు బోనస్ కింద డబ్బులను ఇస్తుంటాయి. దీంతో దసరా అంటే చాలామంది ఇష్టపడతారు. ఇక ఈ దసరా 2020 కంటే 2021 సంవత్సరంలో ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక మందుబాబులు అయితే విపరీతంగా తాగేశారు. ఆ కిక్కులో తూగి తందనాలు ఆడే శారు.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఏంట్రీ..! అందుకే లోబో సీక్రెట్ రూంలోకి..?


  ఒక్క రోజే రూ.200 కోట్ల మద్యం తాగేశారు. ముడు రోజుల్లో దాదాపు రూ.504 కోట్ల మద్యం తాగేశారు. కేవలం అయిదు రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ. 685 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం ఇంకా చాలకపోవడంతో బయట నుంచి కూడా మద్యం తెప్పించుకొని తాగారు. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యంలో గొప్పగా పండుగను చేసుకోలేకపోయారు.

  దీంతో ఈ సారి కరోనాకు ముందు దసరా ఎలా జరుపుకున్నారో ఈ సారి కూడా అలాగే జరుపుకున్నారు. ఇక, దసరా సందర్భంగా ఒక్కరోజే దాదాపు రూ.180 కోట్ల మద్యాన్ని దిగుమతి చేసుకోగా.. గతంలో ఉన్న స్టాక్‌తో కలిసి రూ.200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తేల్చారు అధికారులు. దసరాకు మూడు రోజుల ముందు వరకు ఏకంగా 80.47 లక్షల బీర్లు, 68.31 లక్షల ఐఎంఎల్‌‌‌‌ (ఇండియన్‌‌‌‌ మేడ్‌‌‌‌ లిక్కర్‌‌‌‌) బాటిళ్లు అమ్ముడయ్యాయి.

  ‘అమ్మా లే అమ్మా.. చెల్లి ఆడుకుందాం రా.. అంటూ..’ తల్లీ, చెల్లి మృతదేహం వద్ద ఆ చిన్నారి రోధన.. ఆ దృశ్యాలు..


  దీంతో సర్కార్ ఖజానాకు మస్తు ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో 2,216 వైన్స్‌‌‌‌లు, వెయ్యికి పైగా బార్లు ఉండగా.. మొత్తం 20 డిపోల నుంచి వీటికి మద్యం సరఫరా చేస్తారు. నిన్నటి వరకు కూడా రూ.504 కోట్ల మద్యం డిపోల నుంచి వైన్స్, బార్లకు సరఫరా అయింది. పండుగ రోజు కాకుండా ఒక్కరోజుకు తెలంగాణ సర్కారుకు రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు మాత్రమే డిపోల నుంచి మద్యం లిఫ్ట్‌‌‌‌ చేస్తారు. పండుగ నేపథ్యంలో ఇది రెండింతలైంది.

  Sad Incident: అతడి చిరునవ్వు ఆ రోజుతో చివరిది అని ఊహించలేకపోయాడు.. సైగలతో పలకరించినా చివరకు..


  కరోనా సమయంలో ఎక్కువగా బీర్ల కంపెనీలు నష్టపోయాయి. దీంతో ఒక్కసారిగా లాభాలు వచ్చిపడ్డాయి. దీంతో కంపెనీ యాజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో ఎక్కువగా సేల్స్ జరగపోవడంతో దసరాకు ముందు ఒక్క బీర్ పై రూ. 10 తగ్గించడంతో అనూహ్యంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటికి రూ. 2.06 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి.

  ఇదిలా ఉండగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో రూ.103 కోట్లు, హైదరాబాద్‌లో రూ.43 కోట్ల మద్యం విక్రయాలు సాగినట్లు అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి తర్వాత మూడు రోజులకు నల్గొండలో అత్యధికంగా రూ. 59 కోట్లు అమ్ముడయినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌ జిల్లాల్లో రూ.29 కోట్లు, ఖమ్మంలో రూ.27 కోట్ల మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
  Published by:Veera Babu
  First published: