Home /News /telangana /

500 AMBULANCES AT A SINGLE DAY ENTERED AND 50 MEMBERS HAVE DEAD IN AMBULANCE ITSELF VRY

Lockdown : పొరుగు నుండి ఒక్కరోజులో 500 అంబులెన్స్‌లు..50 మంది అంబులెన్స్‌లో మృతి..అందుకే అనుమతి లేదు..

పొరుగు నుండి ఒక్కరోజులో 500 అంబులెన్స్‌లు..50  మంది అంబులెన్స్‌లో మృతి..అందుకే అనుమతి లేదు

పొరుగు నుండి ఒక్కరోజులో 500 అంబులెన్స్‌లు..50 మంది అంబులెన్స్‌లో మృతి..అందుకే అనుమతి లేదు

Lockdown : తెలంగాణలోకి పొరుగు రాష్ట్రాల అంబులెన్స్‌లను ఎందుకు అనుమతించడం లేదు..? తెలంగాణకు రోజు ఎన్ని అంబులెన్స్‌లు వస్తన్నాయి. ఎంతమంది చనిపోతున్నారు. తెలంగాణ అధికారులు ఎమంటున్నారు. ?

తెలంగాణ ఏపీ సరిహద్దుల వద్ద నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రోగులు రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు కఠినంగా వ్వవహరిస్తున్నారు. స్థానిక ఆసుపత్రుల నుండి అడ్మిట్ కార్డ్ ఉంటేనే అనుమతులు ఇస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను కూడ ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అయితే మరికొంతమందికి అనుమతులు ఉన్నా రాష్ట్రంలోకి అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.. ఇక కర్నూలు సరిహద్దు లోని పుల్లురు వద్ద ఇద్దరు కరోనా రోగులు సైతం మృతి చెందడంతో. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై రెండు రోజుల క్రితం హైకోర్టు కూడ ఫైర్ అయింది. అంబులెన్స్ లను అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నిన్న అంబులెన్స్‌లను అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

కాని నిన్నటి వరకు అనుమతించిన అంబులెన్స్‌లను నేటినుండి పూర్తిగా సరిహద్దుల వద్దే ఆపివేశారు. దీంతో కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ సరిహద్దుకు చేరుకున్నారు. ఆయన తెలంగాణ అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ఇచ్చిన సమాధానం ప్రకారం గురువారం ఒక్క రోజే ఇతర ప్రాంతాల నుండి 500 అంబులెన్స్‌లు వచ్చాయని చెప్పారు. ఇక హైదరాబాద్‌కు చేరుకున్న వారు సైతం అంబులెన్స్‌లోనే 50 మంది చనిపోయినట్టు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో సరైన బెడ్స్ లేవని చెప్పారు. బెడ్స్ ఉన్నప్పుడు అనుమతులు ఇస్తామని తెలంగాణ అధికారులు వివరించారు.

తెలంగాణలో కూడ కొవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడం పక్కరాష్ట్రాల వారు అధికంగా ఇక్కడికి చేరుతుండడంతో స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రజలకు బెడ్స్ అందుబాటులో ఉండడం లేదని తెలంగాణ అధికారులు వివరిస్తున్నారు. అందుకే న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రత్యేకంగా జీవో కూడ విడుదల చేశామని చెబుతున్నారు.

మరోవైపు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు రాష్ట్రాల నిర్ణయాలపై మండిపడ్డారు. ఏపి బిజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఇరు రాష్ట్రాల నిర్ణయాలపై ఫైర్ అయ్యారు. వెంటనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు పుల్లురు వద్ద ప్రజలు ఆందోళన సైతం చేపట్టారు
Published by:yveerash yveerash
First published:

Tags: Lockdown, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు