కరోనా సంక్షోభంలో కూడ నిరంతరాయంగా వరి ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ మాత్రమేనని గుర్తుచేశారు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ సంవత్సరం 80లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగా నిర్ధేశించుకొని 55శాతం సేకరణ పూర్తిచేసి కొనుగోళ్లు జరుపుతున్నామని గుర్తుచేశారు మంత్రి,
గతం కన్నా రెండింతలు దిగుబడి పెరిగింది ఏ రాష్ట్రం చేసుకోని విదంగా ఎఫ్.సి.ఐతో 80లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ఒప్పందం చేసుకొని ఇందుకనుగుణంగా ముందస్థుగానే 20వేల కోట్లను పౌరసరఫరాలశాఖకు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అన్నారు మంత్రి గంగుల కమాలాకర్. అన్నిరాష్ట్రాల్లో సగం దరలకే రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటుంటే కేవలం తెలంగాణ మాత్రమే మద్దతు ధరతో ప్రతీ రైతు వద్దనుండి ధాన్యాన్ని సేకరిస్తుందని, అకాల వర్షానికి తడిసి రంగుమారిన ధాన్యాన్ని సైతం కొనుగోలుచేస్తామన్నారు .
ఇప్పటికే ఉమ్మడి నిజమాబాద్, నల్గొండ జిల్లా పరిధిలో దాదాపు 150 కొనుగోళు కేంద్రాల్లో సేకరణ పూర్తై
మూసేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక రైస్ మిల్లుల నుండి ధాన్యం సేకరణ ద్రువీకరణ వచ్చిన తర్వాత
కేవలం రెండురోజుల్లోనే 99శాతం రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రంలో తౌక్టే తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడా అకాల వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయని వీటికి తోడు కొత్తగూడెం, ములుగు సిరిసిల్ల, ఖమ్మం లాంటి కొన్ని జిల్లాల్లో రైస్ మిల్లుల కొరత ఉండడంతో పక్కనే ఉన్న కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ తదితర జిల్లాలకు ధాన్యాన్ని తరలించడంతో కొంత జాప్యం వస్తుందని, అక్కడక్కడ గోడౌన్ల కొరత వేదిస్తున్నప్పటికీ వాటిని అధిగమించడానికి సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన రైతువేదికల్ని వినియోగిస్తున్నామన్నారు.
కరోనా, లాక్డౌన్ వంటి కారణాలతో 70శాతం ఇతర రాష్ట్రాల వలస కూలీలు, హామాలీలు సొంత రాష్ట్రాలకు
వెల్లిపోవడంతో హమాలీల కొరత వేదిస్తున్నదని, రంజాన్ మాసం సందర్భంగా డ్రైవర్లు, వాహానాల కొరత
ఏర్పడిందని, మరోవైపు మిల్లింగ్ చేసిన ధాన్యం 4లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ఎప్పటికప్పుడు ఎప్.సి.ఐ
తరలించకపోవడంతో మిల్లుల్లో స్థలం కొరత ఏర్పడి అన్ లోడింగ్ చేయాల్సిన వాహానాలు నిలిచిపోయి కొంత జాప్యం జరుగుతుందని, అన్నారు.
ఇక దేశంలో అత్యదికంగా వరిని పండించే పంజాబ్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ఘడ్, యూపి, మద్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు అనేక రాష్ట్రాలు కొనుగోళ్లు నిర్వహించలేక చేతులెత్తేస్తే కేవలం తెలంగాణ మాత్రమే ఘననీయమైన కొనుగోళ్లను జరుపుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇకనైనా అన్నదాతలకు స్థైర్యాన్ని ఇచ్చేవిదంగా వ్యవహరించాలని ప్రతిపక్ష పార్టీలకు మంత్రి హితకు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gangula kamalakar, Karimangar, Paddy