Home /News /telangana /

50 COBRA SNAKES APPEAR AT A TIME IN ONE PLACE OF MEDAK DISTRICT IN TELANGANA NK

మెదక్‌లో షాకింగ్ సీన్... ఒకే చోట 50 తాచుపాము పిల్లలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana : అసలే ప్రజలంతా కరోనా వైరస్ టెన్షన్‌లో ఉంటే... ఆ తాచుపాములు కొత్త టెన్షన్ తెచ్చాయి. ఒక్కసారిగా చుట్టుపక్కల వారంతా షాక్ అయ్యారు.

    Telangana : పామును చూస్తే ఎవరికైనా ప్రాణభయం. ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా తాచుపాము పిల్లలు బయటపడి అటూ ఇటూ పరుగులు తీస్తుంటే పైప్రాణాలు పైనే పోతాయి. ఇందుకు భిన్నంగా మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లికి చెందిన ఓ మహిళ ధైర్యం చూపింది. 50 తాచుపాము పిల్లల్ని కర్రతో కొట్టి చంపేసింది. అవునా, నిజమా అనిపించే ఘటన ఇది. అసలేం జరిగిందంటే... గవలపల్లిలోని కొంక లచ్చల్‌... భార్య స్వరూపతో కలిసి తన వాకిట్లోని బండ రాళ్లను తొలగిస్తున్నాడు. ఓ రెండు రాళ్లు తొలగించగానే... తాచుపాము పిల్లలు కనిపించాయి. వన్ బై వన్ బయటకు వస్తూ ఉన్నాయి

    వామ్మో... పాము పిల్లలు... ఏం పాములివి... అని స్వరూప అంటుంటే... లచ్చల్... వాటిని చూసి... ఇవి తాచుపాము పిల్లలు... దూరంగా ఉండు... విషం ఉంటది... అన్నాడు. అయ్యయ్యో చాలా వస్తున్నాయిగా... వదిలితే ఇంట్లోకి వెళ్లిపోతాయి... ఉండండి ఇప్పుడే వస్తాను... అంటూ ఆమె ఇంట్లోకి పరిగెట్టింది. లోపల రెండు కర్రలున్నాయి. ఒకటి చిన్నగా, ఇంకొకటి పెద్దగా ఉంది. చిన్న పాముల్నైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు కదా... అనుకుంటూ... పెద్ద కర్ర తీసుకుంది. ముందూ వెనకా ఆలోచించకుండా... ఒక్కో పామునూ... పచ్చడి చేస్తూ పోయింది. ఏమాత్రం భయం లేకుండా ఆమె పాములతో ఫైటింగ్ చేసింది.

    ఒక్కో రాయీ తొలగించగా... కుప్పలు తెప్పలుగా పాము పిల్లలు బయటికొచ్చాయి. దేన్నీ వదలకుండా ఆమె అలా చంపుతుంటే... భర్త నోట మాట లేదు. షాకై అలా చూస్తూ ఉండిపోయాడు. మొత్తానికి... అలుపులేకుండా ఆమె... దాదాపు 50 పిల్లల్ని చంపేసింది. ఆ తర్వాత మరో 10 నిమిషాలపాటూ... మళ్లీ పిల్లలేవైనా బయటకు వస్తాయేమోనని చూసింది. అన్నీ రాళ్లూ తొలగించేశారు. కొత్తగా ఏవీ రాలేదు. కానీ... ఊరి జనం అక్కడికి వచ్చి... సోషల్ డిస్టాన్స్‌లో నిలబడి... వింతగా చూశారు.

    వన్యప్రాణి చట్టాల ప్రకారం... పాములు కనిపిస్తే... ఆ విషయాన్ని అటవీ అధికారులకో, స్నేక్ ఫ్రెండ్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలకో చెప్పాలి. కానీ... ఇక్కడ ఆ దంపతులు ఉన్న పరిస్థితి వేరు. అధికారులకు కాల్ చేసి... వాళ్లు వచ్చే వరకూ వెయిట్ చేస్తే... ఆ పాము పిల్లలు అక్కడే ఉండవు కదా. అందుకో ప్రాణభయంతో వారు వాటిని చంపేశామని చెబుతున్నారు. ఐతే... తల్లిపాము మాత్రం కనిపించలేదు. అది ఎక్కడుందో...
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Telangana News, Telangana updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు