తెలంగాణలో రోడ్ టెర్రర్.. మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. నలుగురు స్పాట్‌లోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.

news18-telugu
Updated: September 4, 2020, 8:44 AM IST
తెలంగాణలో రోడ్ టెర్రర్.. మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. వరంగల్, సిద్దిపేట ప్రమాదాలను మరవక ముందే తాజాగా నల్గొండ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-సాగర్ రహదారిపై ఓ కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. నలుగురు స్పాట్‌లోనే చనిపోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి.. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

గురువారం తెల్లవారుజామున సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిదే. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మంచిర్యాల జిల్లా తాండూర్ గ్రామ సర్పంచ్ అంజిబాబుతో పాటు మరో ఇద్దరు మరణించారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమింగా భావిస్తున్నారు.

ఇక బుధవారం వరంగల్ జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌ వద్ద ఇసుక లారీ కారును ఢీకొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఇసుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. ఇలా తెలంగాణలో వరుసగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 4, 2020, 7:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading