హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : 45మంది హాస్టల్ అమ్మాయిలకు అస్వస్థత .. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఇది రెండో ఘటన

Telangana : 45మంది హాస్టల్ అమ్మాయిలకు అస్వస్థత .. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఇది రెండో ఘటన

(FOOD POISON)

(FOOD POISON)

Food Poisoning: తెలంగాణలోని హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. కలుషిత, నాణ్యతలోపం కలిగిన ఆహారం పెడుతూ వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఇలాంటి ఘటన జరగడంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

తెలంగాణ(Telangana)లోని సంక్షేమ హాస్టళ్లు(Hostel), గురుకుల పాఠశాలలు, మైనార్టీ హాస్టళ్లలో కలుషిత ఆహారం(Contaminated food), నాణ్యత లేని భోజనం పెట్టడం వల్ల విద్యార్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. రోజుల వ్యవధిలోనే వరుస సంఘటనలు జరుగుతున్న బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే పదే పదే పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లోనే మరోసారి సిద్ధిపేట(Siddipet)జిల్లా ఎన్సాంపల్లి(Ensampally)ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌(SC Girls Hostel)లో విద్యార్ధినులు నాసీరకం భోజనం చేయడంతో అస్వస్థతకు గురయ్యారు. మూడ్రోజుల క్రితం ఉడని భోజనం పెట్టడం వల్లే విద్యార్ధినులు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు.ఈవిషయాన్ని బయటకు రానివ్వకుండా హాస్టల్ సిబ్బంది అస్వస్థతకు గురైన స్టూడెంట్స్‌(Students)ని హాస్టల్‌లోని ఓ గదిలో ఉంచి పీహెచ్‌సీ వైద్యుల(PHC doctors)తో ట్రీట్‌మెంట్ చేయిస్తున్నారు.

Crime News : కలకలం రేపుతున్న చీకోటి ప్రవీణ్‌ బర్త్‌ డే ఫోటోస్‌..చీకటి సామ్రాజ్యంలో వాళ్లూ భాగస్వాములేనా..నెలలో రెండో ఘటన..

ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఆలస్యంగా బయటపడింది. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ హాస్టల్‌ని సందర్శించారు. విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హెడ్‌ కుక్‌ లేకపోవడం వల్ల కొత్త వాళ్లు వంట చేయడం వల్ల భోజనం నాణ్యత లోపించి అస్వస్థతకు గురైనట్లుగా హాస్టల్ ప్రిన్సిపల్‌ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ అదనపు కలెక్టర్ హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు. స్టూడెంట్స్‌ పూర్తిగా కోలుకునే వరకు వైద్యసిబ్బంది హాస్టల్‌ దగ్గరే ఉండి చికిత్స అందించాలని డీఎంహెచ్‌ఓకు సూచించారు.

కలుషిత ఆహారం తిని 45మంది అస్వస్థత..

మరోవైపు స్థానిక రాజకీయ నాయకులకు విషయం తెలియడంతో హాస్టల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్న స్టూడెంట్స్‌ని పరామర్శించారు. పాఠశాలలో సన్నబియ్యం ఇస్తామని చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లకు దొడ్డు బియ్యం సరఫరా చేసిందని ఆరోపించారు. ఉడికి ఉడకని అన్నం నీళ్ల చారుతో విద్యార్థులు తమ కడుపులు నింపుకోవడం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులు నిండేలా కోట్లది రూపాయలను ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

Telangana : లవ్ సక్సెస్ .. మ్యారేజ్ ఫెయిల్ .. అది తట్టుకోలేక వాళ్లిద్దరూ సూసైడ్బాధ్యులపై చర్యలేవి..

సరిగ్గా నెల రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ కావడం వల్ల వంద మంది అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్ధులు ఆశ్రయం పొందుతూ చదువుకునే హాస్టల్‌లో భోజన సదుపాయల విషయంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన సిద్దిపేట జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంటే ...మిగిలిన జిల్లాలో ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవాలంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇలాంటిని అరికట్టడంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు విద్యార్ధినుల తల్లిదండ్రులు.

Published by:Siva Nanduri
First published:

Tags: Siddipet, Telangana News

ఉత్తమ కథలు