హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: నిద్రలేచాక ఎదురుగా కనిపించిన కోతి.. భయంతో గుండె ఆగి.. అతడి ప్రాణం పోయింది

Karimnagar: నిద్రలేచాక ఎదురుగా కనిపించిన కోతి.. భయంతో గుండె ఆగి.. అతడి ప్రాణం పోయింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్య అరుపులు విని.. భర్త వెంటనే నిద్రలేచాడు. నిద్ర నుంచి లేచి చూసే సరికి.. ఎదురుగా కోతి కనిపించడంతో భయపడిపోయాడు. ఒక్కసారిగా షాక్ గురవడంతో గుండెపోటు వచ్చింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Karimnagar

  ఈ మధ్య జనవాసాల్లో కోతుల సంచారం ఎక్కువయింది. అడవులను వదిలి ఇళ్ల మధ్యకు వస్తున్నాయి. గుంపులు గంపులుగా దండయాత్ర చేస్తున్నాయి. మనలో చాలా మందికి వాటిని చూస్తే భయం వేస్తుంది. కోతి కంటికి కనిపిస్తే చాలు.. ఆమడ దూరం పరిగెడతాం. కరుస్తుందేమోనన్న భయంతో అక్కడి నుంచి పారిపోతాం. ఇదే భయంతో ఓ వ్యక్తి గుండె ఆగింది. కోతి ఎదురుగా కనిపించడంతో.. ఒక్కసారిగా షాక్ గురైన ఆయన... హార్ట్ ఎటాక్‌తో (Man died after seeing Monkey) మరణించాడు. కరీంనగర్‌ (Karimnagar)లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. కరీంనగర్ హనుమాన్ నగర్‌కు చెందిన రుద్రోజు రాజు (45), సరస్వతి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నాడు. రాజు మెకానిక్ పనిచేసేవాడు.

  సరస్వతికి ప్రతి రోజూ తెల్లవారుఝామునే మంచినీళ్లు పట్టడం అలవాటు. ఎప్పటిలాగే.. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నీళ్లు పట్టేందుకు నిద్రలేచింది. నీళ్లు పడుతున్న సమయంలో.. ఇంటి తలుపులను తెరిచి ఉంచింది. కాసేపటికి అటుగా వచ్చిన ఓ కోతి.. తలుపులు తెరిచి ఉండడంతో.. ఇంట్లోకి వెళ్లింది. అప్పటికి సరస్వతి భర్త, ఆమె పిల్లలు ఇంకా నిద్రలేవలేదు. ఇంట్లోనే వారు నిద్రపోతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం నుంచి లోపలికివ వెళ్లిన కోతి.. సరస్వతి చిన్న కుమారుడిపై కూర్చుంది. అది గమనించిన ఆమె.. కోతి.. కోతి.. అని గట్టిగా అరిచింది. భార్య అరుపులు విని.. భర్త వెంటనే నిద్రలేచాడు. నిద్ర నుంచి లేచి చూసే సరికి.. ఎదురుగా కోతి కనిపించడంతో భయపడిపోయాడు. ఒక్కసారిగా షాక్ గురవడంతో గుండెపోటు వచ్చింది. నిద్రలేచిన వ్యక్తి.. అలాగే పడిపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎంత పిలిచినా.. స్పందించకపోవడంతో... భయపడిపోయారు. ఇరుగుపొరుగు వారి సాయంతో..  రాజును హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  ఐతే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. గుండెపోటుతో రాజు చనిపోయాడని వెల్లడించారు. అప్పటి వరకు బాగానే ఉన్న రాజు.. కోతిని చూసి గుండెపోటుతో చనిపోవడంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సరస్వతి, ఆమె పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ప్రాంతంలో కోతులు ఎక్కువగా సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతుల బెడద నుంచి కాపాడాలని అధికార యంత్రాంగానికి పలుమార్లు ఫిర్యాదు చేశామని.. ఐనా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఆ కోతులతో ఇప్పుడు మనిషి ప్రాణమే పోయిందని తెలిపారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందిచాలని.. కోతుల బారి నుంచి కాపాడాలని హనుమాన్ నగర్ వాసులు కోరుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Karimnagar, Telangana

  ఉత్తమ కథలు