హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : Kg మటన్ 400రూపాయలే .. హైదరాబాద్‌కి సమీపంలోనే దొరుకుతోంది

Telangana : Kg మటన్ 400రూపాయలే .. హైదరాబాద్‌కి సమీపంలోనే దొరుకుతోంది

Mutton KG Rs.400

Mutton KG Rs.400

Telangana : తెలంగాణలో మరెక్కాడ లేనంత తక్కువ ధరకే అక్కడ కిలో మటన్ విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో దొరికే సగం రేటుకే రుచికరమైన, ఫ్రెష్ మటన్ దొరుకుతుండటంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు. రద్దీ కారణంగా పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

(K.Veeranna,News18,Medak)

తెలంగాణ (Telangana)రాష్ట్రంలో మరెక్కాడ లేనంత తక్కువ ధరకే అక్కడ కిలో మటన్(Mutton)విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌(Market)లో దొరికే సగం రేటుకే రుచికరమైన, ఫ్రెష్ మటన్ దొరుకుతుండటంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు. తెల్లవారితే చాలు గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మటన్ షాపుకు వచ్చే కస్టమర్లతో ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడానికి..గొడవలు జరగకుండా చూడటానికి ఆ మటన్ షాపు దగ్గర పోలీసు (Police) బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సిద్దిపేట(Siddipet) జిల్లాలో అంత తక్కువ ధరకే మటన్ దొరుకుతున్న గ్రామం ఏదో తెలుసా..?

OMG : భర్తపై ఉన్న కోపాన్ని ముగ్గురు పిల్లలపై చూపించింది .. ఆ ఇల్లాలి పరిస్థితి చివరికి ఏమైందంటే

400లకే కిలో మటన్..

మటన్ ధర చికెన్, చేపల కంటే రెట్టింపు ఉంటుంది. కాని అక్కడ మాత్రం చికెన్, చేపలు లభించే ధరకే కిలో మటన్ అమ్ముతున్నారు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామంలో 400 రూపాయలకే మటన్ అమ్ముతున్నారు. నిజమే మేం చెబుతున్నది. మీరు తెలుసుకున్నది వాస్తవమే. 400రూపాయలకే కిలో మటన్, బోటి 200రూపాయలకే కిలో విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరకే మటన్ అమ్ముతున్నారని తెలియడంతో అక్బర్‌పేటలోని ఆ మటన్‌ షాపు దగ్గర ఇసుక వేస్తే రాలనంత జనం గూమికూడుతున్నారు.

అతి తక్కువ ధరకే విక్రయం..

ఆదివారం, దసరా హాలిడేస్ రావడంతో ప్రతి ఒక్కరూ ఆ మటన్ రుచి చూసేందుకు...కొనుక్కొని వెళ్లేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఎక్కడ మటన్ అయిపోతుందోననే కంగారులో క్యూ లైన్లలో నిల్చున్న వాళ్లు తోసుకోవడం కూడా జరుగుతోంది. బయట మార్కెట్‌లో , పక్కనే ఉన్న మటన్ షాపుల్లో కిలో మటన్ 800లకు విక్రయిస్తుంటే ఇక్కడ 400లకే లభించడం సంతోషంగా ఉందంటున్నారు కస్టమర్లు. అయితే కస్టమర్లు ఒకేసారి గుంపులు, గుంపులుగా రావడంతో పాటు పక్క మండలాల నుంచి కూడా వస్తుండటంతో దుకాణదారులు కస్టమర్లకు మటన్‌ను వెంటనే అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మటన్‌ కోసం జనం కుస్తీ ..

మరోవైపు కిలో మటన్ 400రూపాయలకు విక్రయిస్తున్న షాపు దగ్గర రద్దీతో రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం, దుకాణం దగ్గర తోపులాట వంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో పోలీసులు మటన్ షాపు దగ్గర సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. అయితే పక్కనున్న మటన్ షాపు యజమానులు మాత్రం ఇంత తక్కువ ధరకు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు బేరాల్లేక బేజారవుతున్నారు.

Crime news : బతుకుమ్మ ఆడుతుండగా భార్యను తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన భర్త .. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు

తోటి వ్యాపారులు బేజారు..

కస్టమర్లు ఇంత తక్కువ ధరకు మటన్ విక్రయిస్తుంటే ఎలా గిట్టుబాటు అవుతుందని వేస్తున్న ప్రశ్నలకు యజమాని తాను మేకలను మహా రాష్ట్ర, నవీపేట, పూణె నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణకు తెచ్చి విక్రయిస్తున్నట్లుగా చెబుతున్నారు యజమాని అశోక్. 400రూపాయలకే కిలో మటన్ అమ్మడంపై స్తానిక వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికి తాను మాత్రం ఇదే విధంగా అమ్ముతానని చెప్పడంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఈ షాపు బాగా పాపులర్ అయింది.

First published:

Tags: Siddipet, Telangana News

ఉత్తమ కథలు