హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kasturba Gandhi Girls School: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 40 మంది విద్యార్థులకు అస్వస్థత.. రిమ్స్​కు తరలింపు.. 

Kasturba Gandhi Girls School: కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 40 మంది విద్యార్థులకు అస్వస్థత.. రిమ్స్​కు తరలింపు.. 

రిమ్స్​లో విద్యార్ధినులు

రిమ్స్​లో విద్యార్ధినులు

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో అల్పాహారం, భోజనం అంటేనే విద్యార్థులు అబ్బో అనే పరిస్థితులు నెలకొన్నాయి. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవటం తీవ్ర కలకలం రేపుతోంది

  (కట్టా లెనిన్, న్యూస్ 18 ఆదిలాబాద్ ప్రతినిధి)

  ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో అల్పాహారం, భోజనం అంటేనే విద్యార్థులు (Students) అబ్బో అనే పరిస్థితులు నెలకొన్నాయి. భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలవటం తీవ్ర కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని పలు ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థత (illness) కు గురవుతున్న సంఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. వరుస ఘటనలు విద్యార్థుల (Students) తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజుల్లో 120 మందికి పైగా విద్యార్థులు భోజనం వికటించి అస్వస్థత (illness) కు గురై ఆసుపత్రి పాలయ్యారు.

  తాజాగా ఆదిలాబాద్ (Adilabad) జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో (Kasturba Gandhi Girls' School) భోజనం వికటించి సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థత (illness) కు గురయ్యారు. రాత్రి భోజనంలొకి విద్యార్థులకు పప్పు, అన్నం, ఆలు కర్రీ వడ్డించారు. అది తిన్న విద్యార్థులు ఈ రోజు వాంతులు, విరేచనాలు చేసుకుంటూ అస్వస్థతకు (illness) గురయ్యారు.

  రిమ్స్ ను సందర్శించిన కలెక్టర్​..

  అస్వస్థతకు గురైన విద్యార్థులను (Students) హుటాహుటినా జిల్లా కేంద్రంలోని రిమ్స్ (Rims) ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ రిమ్స్ ను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.  విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, అస్వస్థతకు దారి తీసిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోరు ప్రేమేందర్ కూడా విద్యార్థులను పరామర్శించారు.

  కాగా, మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు ఉదయం తిన్న అల్పాహారం వికటించి సుమారు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇడ్లీతోపాటు వడ్డించిన పల్లీల చట్ని కారణంగా విద్యార్థులు అస్వస్థత (illness) కు లోనైనట్లు గుర్తించారు. అదే రోజు జిల్లాలోని తాంసి మండలం ఘోట్కూరి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు చేసుకోవడంతో వారిని కూడా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనల్లో నిర్లక్ష్య వ్యవహరించిన ఉపాధ్యాయులు, సిబ్బంది పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

  ఇలా రోజుకో పాఠశాల, వసతి గృహంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా బాసర లోని ట్రిపుల్ ఐటిలోనూ భోజనంలో కప్పలు, పురుగులు వస్తుండటం కలవరపెడుతోంది. అయితే సరైన పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యత కూడిన భోజనం పెట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థుల భోజనంపై దృష్టి సారించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Students, Telangana students

  ఉత్తమ కథలు