యువకుల డెత్ మిస్టరీ.. రాత్రిళ్లు నగ్నంగా తిరుగుతున్న మహిళ.. దెయ్యం భయంతో ఆ కాలనీ అంతా ఖాళీ..

దెయ్యం ఉన్నట్టుగా భావిస్తున్న పాడుబడిన బంగ్లా

40 కుటుంబాలు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయాయి. ఆ కాలనీలో దెయ్యం తిరుగుతోందన్నదే వారికి కలిగిన భయం. ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, కాలనీలోని రోడ్లపై నగ్నంగా మహిళా తిరుగోందని..

 • Share this:
  ఒకే కాలనీకి చెందిన యువకులు.. ఒకరి తర్వాత మరొకరు అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అనారోగ్య కారణాలు ఏమీ లేవంటున్నారు. అంతే, ఆ కాలనీ వాసుల్లో భయం పెరిగిపోయింది. వాళ్లకు అప్పటి వరకు ఉన్న ఓ అనుమానంపై ఈ మరణాల వల్ల మరింత భయం పెరిగింది. అంతే ఒక్కో కుటుంబం ఆ కాలనీని విడిచి వెళ్లిపోవడం స్టార్ట్ చేసింది. మొత్తానికి కాలనీలో ఉన్న మొత్తం 40 కుటుంబాలు తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయాయి. ఆ కాలనీలో దెయ్యం తిరుగుతోందన్నదే వారికి కలిగిన భయం. ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, కాలనీలోని రోడ్లపై నగ్నంగా మహిళా తిరుగోందని ఆ కాలనీ వాసులు గుండెల్లో గుబులు పెంచుకున్నారు. జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో బేడ, బుడగ జంగాల ప్రజలు ఓ కాలనీలో ప్రత్యేకంగా ఉంటుంటారు. ఆ కాలనీలో కొన్నాళ్లుగా ఓ పుకారు పుట్టింది. అర్ధరాత్రిళ్లు కాలనీలో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరిగింది. రోజూ రాత్రిళ్లు ఓ దెయ్యం తిరుగుతోందనీ, ఓ మహిళ నగ్నంగా బోణం ఎత్తుకుని నృత్యం చేస్తోందన్న వార్తలు అంతటా వ్యాపించాయి. అదే సమయంలో ఇటీవల ఆ కాలనీకి చెందిన యువకులు అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. ఆ కాలనీకి చెందిన చింతల భాను, చింతల బాలరాజు గతేడాది అక్టోబర్ లో మరణించారు. వారం రోజుల వ్యవధిలోనే వారు చనిపోయారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు అనే వ్యక్తి ఇటీవల మరణించాడు.
  ఇది కూడా చదవండి: నా భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. 54 రోజుల తర్వాత ట్విస్ట్.. బయటపడిన భార్య బండారం.. అసలేం జరిగిందంటే..

  ఈ ముగ్గురి మరణాలకు చేతబడే కారణమనీ, ఆ దెయ్యం వల్లే మరణించారని కాలనీ వాసులంతా నమ్ముతున్నారు. ’మా కాలనీల్లో యువకులు మాత్రమే చనిపోతున్నారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. కానీ రిపోర్టుల్లో మాత్రం ఏమీ ఉండటం లేదు. అందుకే అందరికీ భయం కలుగుతోంది. ఒక్కొక్కరుగా కాలనీని వదిలి వెళ్తున్నారు. కాలనీలో ఉన్న ఓ పాడుబడిన భవనంలో దెయ్యం ఉందని అంతా నమ్ముతున్నారు.‘ అని ఆ కాలనీకి చెందిన గంధం శేఖర్ అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. మంగళవారం నాటికి ఆ కాలనీలో ఉన్న మొత్తం 40 కుటుంబాలు ఖాళీ అవడం గమనార్హం. కాగా, వారికి అవగాహన కల్పించినా, పోలీసులు నచ్చజెప్పినా వినడం లేదని గ్రామ సర్పంచ్ ఎండబట్ల అంజమ్మ చెప్పుకొచ్చారు.
  ప్రసవం తర్వాత ఒంటరిగా ఇంటికి.. పాప ఏదని భర్త నిలదీస్తే చనిపోయిందని చెప్పిన భార్య.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్..!
  Published by:Hasaan Kandula
  First published: