సికింద్రాబాద్‌లో విషాదం... భవనం కూలి చిన్నారి మృతి

ఇంటి యజమాని పురాతన ఇంటిని కూల్చేయకుండా అద్దెకు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపిస్తున్నారు.

news18-telugu
Updated: July 21, 2019, 11:25 AM IST
సికింద్రాబాద్‌లో విషాదం... భవనం కూలి చిన్నారి మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 21, 2019, 11:25 AM IST
సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో విషాదో చోటు చేసుకుంది. పురాతన భవనం స్లాబ్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మరో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పురాతన భవనం కావడంతోనే.. కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి యజమాని పురాతన ఇంటిని కూల్చేయకుండా అద్దెకు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని జేసీబీలతో శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published: July 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...