• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • 3000 CORONA POSITIVE CASES RECORDED WITH IN 24 HOURS IN THE TELANGANA STATE VRY

Corona Update :తెలంగాణలో 3000 ,అతి తక్కువగా అదిలాబాద్‌లో 17

Corona Update :తెలంగాణలో 3000 ,అతి తక్కువగా అదిలాబాద్‌లో 17

తెలంగాణలో 3000 ,అతి తక్కువగా అదిలాబాద్‌లో 17

Hderabad : తెలంగాణలో గడిచిన ఇరవైనాలుగు గంటల్లో మరోసారి మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో మొత్తం 63,120మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 3308మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  • Share this:
తెలంగాణలో గడిచిన ఇరవైనాలుగు గంటల్లో మరోసారి మూడు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో మొత్తం 63,120మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 3308మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే గడిచిన రోజులో మొత్తం 21మంది మృత్యువాత పడ్డారు.. ఇక కరోనా నుండి నేడు 4723మంది కోలుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.. జీహెచ్ఎమ్‌సీ పరిధిలో 513 కేసులు నమోదు కాగా.. జిల్లాల వారిగా ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 200లకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి.. మిగతా జిల్లాలు కరీంనగర్‌లో 161 వరంగల్ అర్భన్ జిల్లాలో 116,అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 17 కేసులు నమోదు అయ్యాయి. కాగా మొత్తంగా జిల్లాల్లో 3308 కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.44కోట్ల శాంపిల్స్‌ పరీక్షించగా.. 5,51,035మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 5,04,970మంది కోలుకోగా..మొత్తం 3106మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారు.ఇక తెలంగాణాలో ప్రస్తుతం 42,959 క్రియాశీల కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 91.64శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉన్నట్టు వెళ్లడించారు.

ఇయితే లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో జీహెచ్‌ఎమ్‌సీ మినహా పలు జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడడం శుభపరిణామం..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ లో నిబంధనలు కఠినతరం చేశారు. రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారిపై రాష్ట్ర పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. గత మూడు రోజులుగా లాక్‌డౌన్ అమలు పకడ్భందిగా అమలతుండడం మరో వారం రోజుల పాటు పరిస్థితులు కొనసాగితే కేసులు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించనున్నట్టు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు