డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా.. షాద్‌నగర్‌లో ముగ్గురు స్టూడెంట్స్ మృతి

స్నేహితుడి సోదరి పెళ్లికి వెళ్లేందుకు ఎనిమిది మంది స్నేహితులు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో షాద్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: October 11, 2019, 3:45 PM IST
డివైడర్‌ను ఢీకొట్టి కారు బోల్తా.. షాద్‌నగర్‌లో ముగ్గురు స్టూడెంట్స్ మృతి
ప్రమాదానికి గురైన కారు
  • Share this:
షాద్‌‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. మరో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్‌ను డీకొట్టిన కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి సమీపంలోని పంటపొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్నేహితుడి సోదరి పెళ్లికి వెళ్లేందుకు ఎనిమిది మంది స్నేహితులు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో షాద్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు