Home /News /telangana /

3 KILLED IN ROAD ACCIDENT IN TELANGANA SANGAREDDY DISTRICT SU MDK

Telangana: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోలోని ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఆటో

రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఆటో

తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

    తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఈ ప్రమాదం చోటుచేసకుంది. ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 8 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.

    ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కంటైనర్ జోగిపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్నట్టు, ఆటో సంగారెడ్డి నుంచి మెదక్ వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Road Accident, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు