Home /News /telangana /

29 YEARS OLD WOMAN CATCHES 20 YEARS OLD THIEF AT MIDNIGHT IN YOUSUFGUDA HYDERABAD FULL DETAILS HERE HSN

Hyderabad: హైదరాబాద్ లో అర్ధరాత్రి మెట్రోస్టేషన్ వద్ద ఓ యువతి.. క్యాబ్ కోసం ప్రయత్నిస్తోంటే చాటుగా ఓ కుర్రాడు వచ్చి..

నిందితుడు నవీన్ నాయక్

నిందితుడు నవీన్ నాయక్

డ్యూటీ అయిపోయాక ఆమె ఇంటికి బయలుదేరింది. యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చింది. అప్పటికే రాత్రి 10.30గంటలు కావడంతో మెట్రో రైలు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ కింద నిలుచుని క్యాబ్ బుక్ చేస్తుండగా..

    హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఓ యువతి చేసిన సాహసం ఆమెపై ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తోంది. అర్ధరాత్రి అయినా కూడా ఏమాత్రం బెరుకు లేకుండా ఓ దొంగను వెంటాడి దొరకబట్టిన ఉదంతం గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భూమిక విమల్ అనే 29 ఏళ్ల యువతి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ డిజైనర్ స్టోర్ లో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి ఆమె తన డ్యూటీ అయిపోయాక ఇంటికి బయలుదేరింది. యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చింది. అయితే అప్పటికే రాత్రి 10.30గంటలు కావడంతో మెట్రో రైలు అందుబాటులో లేకుండా పోయింది. దీంతో యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ కింద నిలుచుని క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

    ఇంతలో సడన్ గా ఓ కుర్రాడు ఆమె ఫోన్ ను లాక్కున్నాడు. కృష్ణా నగర్ వైపు పరుగులు తీశాడు. ఊహించని రీతిలో ఈ ఘటన జరగడంతో ఆమె బిత్తరపోయింది. క్షణాల్లోనే తేరుకుని దొంగ, దొంగ అని అరుస్తూ అతడి వెంట పడింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ బైకర్ సాయాన్ని తీసుకుంది. అతడి బైక్ పై ఎక్కి అతడిని వెంబడించింది. అతడు సింధు టిఫిన్స్ సెంటర్ వద్ద ఉన్న సందులోకి దూరడాన్ని ఆమె చూసింది. అక్కడే ఓ గోడ పక్కన అతడు దాక్కుని ఉండటాన్ని చూసింది. వెంటనే అతడిని పట్టుకుని తన మొబైల్ ను తన చేతుల్లోకి లాక్కుంది.
    ఇది కూడా చదవండి: గుంటూరులో డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!

    స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. జూబ్లిహిల్స్ పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడిని 20 ఏళ్ల నవీన్ నాయక్ గా గుర్తించారు. అతడు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు. మొత్తానికి ధైర్యంతో అర్ధరాత్రి సమయంలో కూడా దొంగ వెంట పడి తన మొబైల్ ను సంపాదించుకున్న భూమికను పోలీసులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు.
    ఇది కూడా చదవండి: ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Hyderabad, Hyderabad Metro, Telangana, TS Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు