హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్ లో కలకలం.. పార్టీకి వెళ్తున్నానని చెప్పి అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఆ మెడికల్ విద్యార్థి..

Hyderabad: హైదరాబాద్ లో కలకలం.. పార్టీకి వెళ్తున్నానని చెప్పి అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ లో ఆ మెడికల్ విద్యార్థి..

రాజశేఖర్ కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. పీజీ చేయాలన్న కల నెరవేరదన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి ఫ్లాట్ కే వచ్చి ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

రాజశేఖర్ కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. పీజీ చేయాలన్న కల నెరవేరదన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి ఫ్లాట్ కే వచ్చి ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడన్న దానిపై విచారణ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

అప్పటిదాకా స్నేహితులతోనూ బంధువులతోనూ సంతోషంగా చెప్పిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నానని చెప్పిన యువకుడు కాస్తా గదిలో శవమై కనిపించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  హైదరాబాద్ లో వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అద్దెకు ఉంటున్న ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరేసుకుని మరణించాడు. అప్పటిదాకా స్నేహితులతోనూ బంధువులతోనూ సంతోషంగా చెప్పిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నానని చెప్పిన యువకుడు కాస్తా గదిలో శవమై కనిపించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల శశాంక్, 28 ఏళ్ల శరణ్ అన్నాదమ్ములు. ఇద్దరూ నాలుగేళ్లుగా హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్ పల్లిలో సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

  శశాంక్ కు చెన్నైలో ఉద్యోగం రావడంతో కొద్ది రోజుల క్రితం అక్కడకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ అపార్ట్మెంట్ లో శరణ్ మాత్రమే ఒంటరిగా ఉంటున్నాడు. గాంధీ ఆస్పత్రి మెడికల్ కాలేజీలో శరణ్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ చదవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఫిబ్రవరి నెల ప్రారంభంలో నెల్లూరులోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. రెండు వారాల పాటు స్నేహితుడి ఇంట్లోనే ఉన్నాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసినందున కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉందంటూ కుటుంబ సభ్యులతో చెప్పి ఫిబ్రవరి 15వ తారీఖున హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం జీడిమెట్లలో ఉంటున్న మేనమామ మేరాజు ఇంటికి వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లాల్సి ఉందని చెప్పి రాత్రి 8.30గంటలకు కార్లో బయటకు వెళ్లిపోయాడు.

  ఇది కూడా చదవండి: స్కూటీపై వెళ్తూ.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన 19 ఏళ్ల యువతి.. చివరకు జరిగిన ఘోరమిది..

  రాత్రి 11గంటలకు తన అపార్ట్మెంట్ కు చేరుకున్నాడు. మరుసటి రోజు ఫిబ్రవరి 16న తల్లిదండ్రులు శరణ్ కు ఫోన్ చేశారు. అతడు ఎంతకూ ఫోన్ ను లిప్ట్ చేయలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా శరణ్ నుంచి స్పందన లేకపోవడంతో మేనమామకు సమాచారం ఇచ్చారు. శరణ్ ఉండే అపార్ట్మెంట్ కు వెళ్లి చూడాల్సిందిగా కోరారు. మేరాజు ఆ అపార్ట్మెంట్ కు వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది. ఫోన్ చేస్తే గదిలోంచి రింగ్ టోన్ వినిపించడంతో పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు 108 సిబ్బందితో సహా వచ్చి ఆ గది తలుపులు పగలగొట్టి చూస్తే శరణ్ ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. అప్పటికే అతడు చనిపోయాడడని 108 సిబ్బంది తేల్చారు. తనకు ఉద్యోగం లేదనీ, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానీ ఓ లేఖలో రాశాడు. తన ఆత్మహత్యకు ఇవే కారణాలంటూ ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇది కూడా చదవండి: పెళ్లి ఏర్పాట్లను చూసి వధువులో ఉత్సాహం.. కారు టాప్ తీసి మరీ డాన్స్.. వరుడి బంధువు మృతి.. అసలేం జరిగిందంటే..

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Adilabad, Crime news, Hyderabad, Telangana