హోమ్ /వార్తలు /తెలంగాణ /

public holidays in 2022 : వచ్చే ఏడాది 28 సాధారణ సెలవులు -2022లో సెలవుల జాబితా ఇదే

public holidays in 2022 : వచ్చే ఏడాది 28 సాధారణ సెలవులు -2022లో సెలవుల జాబితా ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మింగేసిన మరో ఏడాదిగా 2021 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. కొత్త ఏడాది ప్రారంభానికి మరో నెల రోజులే మిగిలున్న నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ప్రభుత్వ సెలవులపై ప్రకటన వెలువడింది. వచ్చే ఏడాది మొత్తం 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులున్నాయి. వివరాలివే..

ఇంకా చదవండి ...

కరోనా మింగేసిన మరో ఏడాదిగా 2021 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. కొత్త ఏడాది ప్రారంభానికి మరో నెల రోజులే మిగిలున్న నేపథ్యంలో రాబోయే ఏడాదిలో ప్రభుత్వ సెలవులపై ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బ్యాంకు సెలవులపై స్పష్టత రాగా, తెలంగాణ (Telangana )లో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలీడేస్, పెయిడ్ హాలిడేస్ పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022లో ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 28 రోజులపాటు సాధారణ సెలవులు, మరో 23 రోజులు ఆప్షనల్ హాలిడేస్ ను ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో సెలవులకు సంబంధించి ప్రభఉత్వం జీవో నంబర్ 2618, 2619లను తాజాగా జారీ చేసింది. 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవుతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన (పెయిడ్ హాలిడేస్) సెలవులను (నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్) 23గా నిర్ధారిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. తెలంగాణలో సెలవుల జాబితా ఇదే..

అమెరికాకు బుద్ధి చెప్పేలా మోదీ మంత్రాంగం -డిసెంబర్ 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక -modi putin summit 2021



సాదారణ సెలవులు ఏవంటే..

జనవరి 1 - శనివారం - కొత్త సంవత్సరాది

జనవరి 14 -శుక్రవారం -భోగి

జనవరి 15 -శనివారం -సంక్రాంతి

జనవరి 26 -బుధవారం -రిపబ్లిక్ డే

మార్చి 1 - మంగళవారం -మహాశివరాత్రి

మార్చి 18 -శుక్రవారం -హోలీ

ఏప్రిల్ 2 -శనివారం -ఉగాది

ఏప్రిల్ 5 -మంగళవారం -జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 10- ఆదివారం -శ్రీరామనవమి

ఏప్రిల్ 14 -గురువారం -అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 15 -శుక్రవారం -గుడ్ ఫ్రైడే

మే 3 -మంగళవారం -రంజాన్

మే 5 -బుధవారం -రంజాన్ తర్వాతి రోజు

జులై 10 - ఆదివారం - బక్రీద్

జులై 25 -సోమవారం -బోనాలు

ఆగస్టు 9 - మంగళవారం -మొహర్రం

ఆగస్టు 15 -సోమవారం -స్వాతంత్ర్య దినోత్సవం

ఆగస్టు 20 - శనివారం -శ్రీకృష్ణాష్టమి

ఆగస్టు 31 - బుధవారం - వినాయక చవితి

సెప్టెంబర్ 25 - ఆదివారం -బతుకమ్మ తొలిరోజు

అక్టోబర్ 2 -ఆదివారం -గాంధీ జయంతి

అక్టోబర్ 5 -బుధవారం విజయదశమి

అక్టోబర్ 6 -గురువారం -దసరా తర్వాతి రోజు

అక్టోబర్ 9 -ఆదివారం -ఈద్ మిలాదున్ నబీ

అక్టోబర్ 25 -మంగళవారం -దీపావళి

నవంబర్ 8 - మంగళవారం -కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి

డిసెంబర్ 25 - ఆదివారం - క్రిస్మస్

డిసెంబర్ 26 -సోమవారం -బాక్సింగ్ డే

Tomato prices : కిలో రూ.200 తప్పదు! -షాకింగ్ విషయం చెప్పిన Crisil -టమాటాపై కేంద్రం అప్పులు


జనవరి 1న సెలవు రోజును ఫిబ్రవరి 12(రెండో శనివారం) పనిదినంగా పరిగణిస్తారు. ఇవి కాకుండా 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయి.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సాధారణ సెలవులు కాకుండా ఐదు ఐచ్ఛిక సెలవలు పొందొచ్చు. అయితే, పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజా పనుల శాఖలకు ఈ ఉత్తర్వులు వర్తించబోవని, వాటికి సెలవులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Telangana, Telangana News

ఉత్తమ కథలు