తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 272... నేడు కూడా భారీగానే...

తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కు పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: April 4, 2020, 10:13 PM IST
తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 272... నేడు కూడా భారీగానే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 272కు పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కేసులు నమోదయ్యాయి. నిన్న (ఏప్రిల్ 3) కరోనా కేసుల సంఖ్య 229. ఈ రోజు 43 మందికి కొత్తగా బాధితులు చేరడంతో సంఖ్య 272కు పెరిగింది. తెలంగాణలో గత రెండు రోజులగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న (ఏప్రిల్ 3)న 75 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు (ఏప్రిల్ 4) మరో 43 కరోనా పాజిటివ్ కేసులను ప్రభుత్వం నిర్ధారించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ప్రకటించిన వివరాల ప్రకారం 11 మంది మృతి చెందారు. ఈ రోజు ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. దీంతోమొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33కు పెరిగింది.

తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పుడు నమోదవుతున్న కేసులన్నీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారేనన్నారు. సికింద్రాబాద్, షాద్ నగర్‌లో చనిపోయిన వారు కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వారిని కలిసిన వారేనని చెప్పారు. మర్కజ్ నుంచి 1090 మంది తెలంగాణకు వచ్చారని, వారందరినీ పరీక్షిస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

తెలంగాణలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య


తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు 6 ల్యాబ్స్ 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. 5లక్షల N-95 మాస్క్‌లు, 5లక్షల PPE కిట్లు, 5లక్షల వైరల్ ట్రాన్స్‌మిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, 4లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్క్‌లు, 25 లక్షల హ్యాండ్ గ్లౌజ్‌లు కొనుగులు చేసినట్టు తెలిపింది. గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రి మరో రెండు రోజుల్లో సిద్ధమవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading