Home /News /telangana /

27 LAKH POWER ENGINEERS PROTEST AGAINST ELECTRICITY AMENDMENT BILL TELANGANA MAY FACE POWER CUTS TODAY MKS

Electricity protest: సమ్మెలోకి 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు.. కరెంటు కష్టాలు తప్పవు!

సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు

సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు

కేంద్రం విద్యుత్తు చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటంతో సోమవారం నుంచి విద్యుత్తు ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా మహా ధర్నా చేపట్టారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Punjab | Telangana
కేంద్రంలోని మోదీ సర్కారు కొత్తగా తీసుకురానున్న విద్యుత్ సవరణ చట్టాన్ని (Electricity Amendment Bill 2022) వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు (Power Engineers Protest). తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల (Telangana Electricity Employees) సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపనుందనే అంచనాలున్నాయి. కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో విద్యుత్తు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనుండటంతో ఈ బిల్లును నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘాలు నేటి నుంచి దేశవ్యాప్తంగా మహా ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని సంఘాలు తెలిపాయి.

కొత్త విద్యుత్ చట్టం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలతో కూడిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వినియోగదారులపై చార్జీల భారం పెంచడంతో పాటు.. కోట్లాది రూపాయలతో విద్యుత్తు సంస్థలు ఏర్పాటు చేసిన విద్యుత్తు లైన్ల నుంచి ప్రైవేటు సంస్థలు విద్యుత్‌ సరఫరా చేసుకునేలా బిల్లు రూపొందించారని.. అందుకే దీన్ని నిరసిస్తూ మహాధర్నా చేపడుతున్నామని విద్యుత్‌ సంఘాల నేతలు తెలిపారు.

CM KCR | I-Day : నేటి నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. 2వారాల షెడ్యూల్ ఇదే: సీఎం కేసీఆర్


డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. విద్యుత్‌ సంస్థలను పారిశ్రామివేత్తలకు ధారాదత్తం చేసేందుకే ఈ బిల్లు పెడుతున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ 12 రాష్ట్రాలు తీర్మానం చేశాయని.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని తెలంగాణ నేతలు పేర్కొన్నారు.

Heavy Rains : రాబోయే 3రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ, ఏపీకి IMD హెచ్చరిక.. ఈ జిల్లాల్లో అలర్ట్..


తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచే విధులు బహిష్కరించారు.
సోమవారం జనరేటింగ్‌ స్టేషన్లు, సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయనున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో టీఈఈ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఉచిత పథకాలతో సంక్షేమం వట్టిమాట! ఇదిగో రుజువులు..పేదలకు సబ్సిడీ కొనసాగాలంటే ఇలా..


పార్లమెంట్‌లో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడితే నిరసనలు తీవ్రతరం చేస్తామని విద్యుత్‌ సంఘాల నేతలు హెచ్చరించారు. బీజేపీ నేతలను, ఎంపీలు, కేంద్ర మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. అవసరమైతే బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్రమంత్రుల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని వారు హెచ్చరించారు.



విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాతో తెలంగాణ వ్యాప్తంగా కరెంట్‌ సరఫరా తీవ్ర అంతరాయాలు ఏర్పడి చీకట్లు కమ్ముకునే ప్రమాదముందని.. పరిశ్రమలపై తీవ్ర ప్రభా వం పడే ప్రమాదం ఉందని కొంతమంది సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ఫీడర్లు ట్రిప్పయినా, విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తినా వాటి పరిష్కారానికి గంటల కొద్దీ సమయం పట్టే అవకాశముంది. అత్యవసర సేవలందించే ఆస్పత్రులపైన, మెట్రో, రైల్వే, పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. అలాగే.. విద్యుత్‌ డిమాండ్‌ తగ్గి గ్రిడ్‌ కుప్పకూలే ప్రభావం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు చేస్తున్న ఉద్యమంలో వినియోగదారులు తమకు సహకరించాలని సంఘాలు కోరుతున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: ELectricity, India, Monsoon session Parliament, Power cuts, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు