హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode By-poll: 2 నెలల్లోనే 25వేల కొత్త ఓట్లు.. మునుగోడులో ఏం జరుగుతోంది? హైకోర్టుకు బీజేపీ

Munugode By-poll: 2 నెలల్లోనే 25వేల కొత్త ఓట్లు.. మునుగోడులో ఏం జరుగుతోంది? హైకోర్టుకు బీజేపీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugode Bypoll: కేవలం 2 నెలల 10 రోజుల్లో ఇంత భారీగా దరఖాస్తులు రావడం వెనుక టీఆర్ఎస్ కుట్ర దాగిందని బీజేపీ ఆరోపిస్తోంది. పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | munugode

మునుగోడు ఉపఎన్నిక (Munugode Bypoll) తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సెగలు రేపుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థులు జనంలో తిరుగుతున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఐతే మునుగోడు (Munugodu) ఎన్నికల్లో ఓటర్లకు అన్ని పార్టీలు భారీగా డబ్బు ఆశజూపుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటుకు రూ.20వేల నుంచి 30వేలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మునుగోడు ఓటర్ల సంఖ్య భారీగా పెరగిందన్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. కేవలం రెండు నెలల్లోనే 25వేల ఓటరు దరఖాస్తులు వచ్చాయి. దీనిపై బీజేపీ హైకోర్టు (HighCourt) ఆశ్రయించింది. పాత ఓటరు జాబితా ఆధాంరగానే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఫారం 6, 7, 8, 8ఏ విభాగాలకు చెందిన 25 వేల దరఖాస్తులను ఎలాంటి పరిశీలన లేకుండానే ఎన్నికల సంఘం ఆమోదించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల సంఘం చర్య రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950కి విరుద్ధమని ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 31 వరకు 7 నెలల్లో మునుగోడు, చండూరు మండలాల్లో 1,474 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. మిగతా మండలాలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య సుమ రు 2 వేల వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ ఈ నెల 10న జిల్లా కలెక్టర్‌ (జిల్లా ఎన్నికల అధికారి) నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కొత్తగా ఫారం 6 దరఖాస్తులే 24,781 వచ్చినట్లు అధికారులు వెల్లడించినట్లు చెప్పారు. కేవలం 2 నెలల 10 రోజుల్లో ఇంత భారీగా దరఖాస్తులు రావడం వెనుక టీఆర్ఎస్ కుట్ర దాగిందని ఆయన ఆరోపించారు.

Telangana BJP: బీజేపీ నేతలకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదా ?.. అంతా బన్సల్ మార్క్ వ్యూహమా 

ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే.. కొత్త ఓటర్ల జాబితాను అడ్డుకోవాలని హైకోర్టును కోరారు ప్రేమేందర్ రెడ్డి. ఈ ఏడాది జూలై 31 వరకు ఉన్న ఓటర్ల జాబితాతోనే ఉప ఎన్నిక నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. అక్టోబరు 14న ప్రకటించనున్న ఓటర్ల జాబితాపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను లంచ్‌ మోషన్‌గా స్వీకరించి అత్యవసరంగా విచారణ చేపట్టాలని బీజేపీ తరఫు న్యాయవాది రచనారెడ్డి మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనాన్ని కోరారు. లేదంటే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. ఐతే లంచ్‌ మోషన్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 13న విచారణ చేపడతామని తెలిపింది.

మునుగోడులో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అక్టోబరు 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్లను లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు.

First published:

Tags: Munugode Bypoll, Munugodu, Munugodu By Election, Telangana

ఉత్తమ కథలు