23 YEAR OLD YOUTH ATTACKED ON SOFTWARE ENGINEER IN HYDERABAD AFTER SHE REFUSES TO MARRY HIM FULL DETAILS HERE HSN
సెలూన్లో పనిచేసే 23 ఏళ్ల కుర్రాడు.. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ యువతి.. కులం, మతం వేరైనా ఆమె పెళ్లికి సిద్ధపడినా..
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ లో మంగళవారం రాత్రి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై ఓ వ్యక్తి జరిపిన దాడి కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారం చెడటం వల్లే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ లో మంగళవారం రాత్రి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై ఓ వ్యక్తి జరిపిన దాడి కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారం చెడటం వల్లే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. మహిళా టెకీకి, సెలూన్ లో పనిచేసే వ్యక్తికి ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ అంతలోనే ఆ ప్రేమ కాస్తా ఒకే ఒక్క కారణంతో చెడిపోయింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న ఆ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్ లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షా కోట్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై జరిగిన దాడి కేసునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హర్యాణా రాష్ట్రానికి చెందిన 23ఏళ్ల షారూఖ్ సల్మాన్ కొన్నేళ్లుగా స్థానికంగా ఉన్న జావెద్ హబీబ్ సెలూన్ లో పనిచేస్తున్నాడు. ఆ సెలూన్ కు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా పలుమార్లు వెళ్లడంతో అతడు పరిచయం అయ్యాడు.
ఆ పరిచయం వల్ల ఇద్దరి మధ్య చనువు ఏర్పడటం, అది కాస్తా ప్రేమ వ్యవహారం వరకు వెళ్లడం జరిగింది. కులం, మతం వేరయినా, అతడి కంటే ఎక్కువగా చదివి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నా కూడా అతడినే పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి సిద్ధమయింది కూడా. అయితే ఊహించని రీతిలో ఆమెకు ఓ నిజం తెలిసింది. అతడికి అప్పటికే పెళ్లయిందన్న నిజం తెలిసి అతడిని దూరం పెట్టింది. అయితే తనను దూరం పెట్టడాన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఆమెను దక్కించుకోవాలని ఎంతో ప్రయత్నించాడు.
అయినప్పటికీ ఆమె దూరం పెట్టడంతో చివరిసారిగా మాట్లాడాలని మంగళవారం రాత్రి ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లాడు. అపార్ట్మెంట్ కిందకు రప్పించాడు. ఆమెను మాటల్లో పెట్టి తన వెంట తీసుకొచ్చుకున్న కత్తిని బయటకు తీశాడు. ఆ కత్తితో ఆ యువతిపై దాడికి పాల్పడ్డాడు. ఆ యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రాగానే అతడు పారిపోయేందుకు యత్నించాడు. స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్ లో ఉన్నాడు.