Corona update : తెలంగాణలో కోత్త కేసులు 2261 ..మరణాలు 18

తెలంగాణలో కొత్త కేసులు 2261 ..మరణాలు 18

Corona :తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా..ఇవాళ కొత్తగా 2261 కేసులు నమోదయ్యాయి.. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

  • Share this:
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి..ఇవాళ కొత్తగా 2261 కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు 18 మంది చనిపోయారని తెలిపారు. మరోవైపు మూడువేల నలబై మూడు మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని వివరించారు. పాజిటివిటి రేటు రెండు శాతానికి పడిపోయిందని చెప్పిన ఆయన రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో కరోనా ఉదృతంగా ఉందని ఈ నేపథ్యంలోనే వ్యాధి ఉదృతిపై అధ్యయనాలు చేయాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు.

ఇక దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసుల ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలోనే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండగా వాటిలో 14వేలకు పైగా పడకలు ఖాలీగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు 7000 బెడ్స్ ఐసీయూలో కూడా ఖాలీలు ఉన్నాయని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఫీవర్ సర్వే మూడవ దశ కూడా కొనసాగుతుందని, కాగా ఇప్పటివరకు 87 లక్షలక పైగా ఇళ్లలో సర్వే నిర్వహించగా సుమారు నాలుగు వేల మందికి కరోనా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడిపై చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు..

ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండు డోసులకు గాను 62 లక్షల 23వేల 824 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తియిందని తెలిపారు. అయితే రెండు డోసులే పూర్తి అయిన వారు 14లక్షల 75 వేల మంది ఉన్నారు. మొదటి డోసు వేసుకున్నవారు సుమారు 48 లక్షల మంది ఉన్నట్టు తెలిపారు. జూలై నెలలో రాష్ట్రానికి 18 లక్షల డోసులు కేంద్రం నుండి రానున్నట్టు వెల్లడించారు. ఇక వ్యాక్సినేషన్ కోసం ప్రైవేటు ఆసుపత్రులను కూడా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.
Published by:yveerash yveerash
First published: