కాసేపట్లో రైలు ఎక్కాలి.. వాష్‌రూమ్‌కి వెళ్లొస్తాని చెప్పిన యువతి తిరిగి రాలేదు.. ఏం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

మరికాసేపట్లో రైలు వస్తుందనే సమయంలో మినీ ఏంజెల్ వాష్ రూమ్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిపోయింది. అరగంట గడిచినా ఆమె రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. అక్కడికి వెళ్తే కూడా కనిపించలేదు

  • Share this:
    వారిది తమిళనాడు. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సొంతూరు తమిళనాడుకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. ఐతే టాయిలెట్‌కు వెళ్లొస్తానని చెప్పిన యువతి తిరిగి రాలేదు. ఎంత సేపు వెతికినా దొరకలేదు. ఆమె ఎక్కడికి వెళ్లింది? ఏమైపోయిందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని రాణిపేట్‌ జిల్లాకు చెందిన మిని ఏంజెల్ (22) అనే యువతి హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి పేరు థామస్. వృతి రీత్యా మినీ ఏంజెల్ స్టాఫ్ నర్సు. ఐతే జులై 29న తమిళనాడు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి సొంతూరుకు వెళ్లాలనుకున్నారు.

    మరికాసేపట్లో రైలు వస్తుందనే సమయంలో మినీ ఏంజెల్ వాష్ రూమ్‌కు వెళ్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిపోయింది. అరగంట గడిచినా ఆమె రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోంది. అక్కడికి వెళ్తే కూడా కనిపించలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కాల్ కలవలేదు. చుట్టుపక్కల మొత్తం వెతికారు ఎక్కడా కనిపించలేదు. ఆలస్యమయ్యే కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. అలా కొన్ని గంటల పాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఐనా ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆమె కాల్ డేటా వివరాలను ఆరా తీస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: