Home /News /telangana /

22 COVID TREATMENT PRIVATE HOSPITALS LICENSE RENEWAL TODAY VRY

Corona hospitals license : సాధించిన కరోనా ఆసుపత్రులు...రద్దైన అనుమతుల పునరుధ్దరణ

Corona hospitals license : సాధించిన కరోనా ఆసుపత్రులు...రద్దైన అనుమతుల పునరుధ్దరణ

Corona hospitals license : సాధించిన కరోనా ఆసుపత్రులు...రద్దైన అనుమతుల పునరుధ్దరణ

Corona hospitals license : కరోనా రోగుల వద్ద అదనపు ఫీజులు వసూలు చేసిన ఆసుపత్రుల అనుమతులు తిరిగి పునరుధ్దరించారు..అయితే అదనపు ఫీజులను తిరిగి చెల్లించడంతో పాటు మరోసారి ఇలాంటీ సంఘటనలు పునరావృతం చేయకూడదనే నిబంధనతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది..

ఇంకా చదవండి ...
కరోనా రోగులను పీల్చి పిప్పి చేసిన ప్రైవేటు ఆసుపత్రులు తమ పంతాన్ని నెగ్గించుకున్నాయి..అధిక పీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో కోవిడ్ చికిత్స చేయకుండా నిషేధం విధించారు..కోవిడ్ అనుమతులను రద్దు చేశారు..అయితే కొద్ది రోజులపాటు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం చుట్టూ ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తిరిగాయి..ఎట్టకేలకు కొద్ది రోజుల అనంతరం తిరిగి తమ అనుమతులను పునరుద్దరించుకున్నాయి.

తెలంగాణలో 22 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్సలు చేయటానికి అనుమతులు పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో గతంలో కరోనా చికిత్స పేరుతో బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్మును 2 వారాల్లో చెల్లించాలని డీహెచ్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాధితుల నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్మును చెల్లించిన తరువాత తిరిగి ఆయా ఆసుప్రతుల్లో కరోనా చికిత్సలు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.

దీంతోపాటు తిరిగి అనుమతులు ఇచ్చామని దోపిడి తెరతీసినా.. మరోసారి బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. రెండవసారి తప్పు జరిగితే.. ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేసి.. క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

కాగా కరోనా రోగుల బలహీనతను ఆధారంగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు బిల్లులు భారీగా వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రోగుల్లో అసంతృప్తి నెలకొంది..ప్రభుత్వం ఆసుపత్రులపై చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి పక్షపార్టీలు సైతం విమర్శలు చేశాయి..మరోవైపు హైకోర్టు సైతం అధిక ఫీజుల వసూళ్లపై మండిపడింది..దీంతో వాటిని కట్టడి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది..అదనపు వసూళ్లను తిరిగి భాదితులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని చెప్పడంతో పాటు భాదితులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వాపసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..ఈనేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలోని అధిక ఫీజుల వసూలు చేస్తున్న ఫిర్యాదులు అందుకుని 105 ఆసుపత్రులకు నోటిసులు జారీ చేశారు... నోటిసుల అనంతరం 24 గంటల్లో ఫిర్యాదులపై సమాధానం చెప్పాలని ఆదేశించారు.. ఇలా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని 22 ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నారు.

అనుమతులు రద్దు చేసిన వాటిలో బంజారాహిల్స్‌లోని విరంచి హస్పిటల్, కూకట్ పల్లిలోని పద్మజ ఆసుపత్రి, అల్వాల్ లైఫ్ లైన్ మెడిక్యూర్ ఆసుపత్రులతోపాటు ఉప్పల్ లోని టీఎక్స్ ,వీటితోపాటు వరంగల్ లోని మ్యాక్స్ కేర్, లలిత ఆసుపత్రితో పాటు సంగారెడ్డిలో శ్రీసాయిరామ్ , ఉండగా ఖమ్మం వరంగల్ జిల్లాల్లో కూడా కొనని ఆసుపత్రులను రద్దు చేశారు..
Published by:yveerash yveerash
First published:

Tags: Covid hospital, Private hospitals, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు