Telangana : తగ్గుతున్న కరోనా కేసులు.. రాష్ట్రంలో 2175 .. పడిపోయిన పాజిటివిటి రేటు

ప్రతీకాత్మక చిత్రం

Telangana corona : తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. నిన్నటితో పోలిస్తే.. సుమారు వంద కేసుల వరకు తగ్గాయి.. కాగా ఇవాళ కొత్తగా 2175 కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

  • Share this:
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. నిన్నటితో పోలిస్తే.. సుమారు వంద కేసుల వరకు
తగ్గాయి.. కాగా ఇవాళ కొత్తగా 2175 కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా రాష్ట్ర
వ్యాప్తంగా నేడు 15 మంది చనిపోయారని తెలిపారు. మరోవైపు మూడువేల ఎనిమిది వందల ఇరవై మంది
బాధితులు కరోనా నుండి కోలుకున్నారని వివరించారు. పాజిటివిటి రేటు రెండు శాతానికి పడిపోయిందని
ప్రకటించారు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 30 వేల 918 కరోనా కేసులు ఆక్టీవ్‌గా ఉన్నాయని వివరించారు. ఇక రాష్ట్రంలోని గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1 లక్ష 36 వేల 96 కరోనా టెస్టులు చేసినట్టు తెలిపారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 253 కొత్త కరోనా కేసులు ఉండగా ,ఖమ్మంలో 144, నల్గొండలో 178, భద్రాద్రి జిల్లాలో 110 , కరీంనగర్ లో113 కేసులు నమోదైనట్టు వెల్లడించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 55వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండగా వాటిలో 14వేలకు పైగా పడకలు ఖాలీగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు 7000 బెడ్స్ ఐసీయూలో కూడా ఖాలీలు ఉన్నాయి..మొత్తం మీద గత రెండు రోజులుగా రెండు శాతం కంటే తక్కువగా కరోనా పాజిటీవ్ రేటు ఉండడంతో ఇది మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి..ముఖ్యంగా 5 శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి..ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 2 శాతానికి పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకోవడంతో ఆన్‌లాక్‌ ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Published by:yveerash yveerash
First published: