బిర్యానీ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. బాధితుల వివరాల ప్రకారం..శనివారం హోటల్ లో బిర్నానీ తినన ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మరో 15 మందికి వాంతులయ్యాయి.
తెలంగాణలో బిర్యానీ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు.. బ్యాచలర అయినా.. ఫ్యామిలీ అయినా అలా బయటకు వెళ్లి రెస్టారెంట్లో బిర్యానీ తిని వస్తుంటారు. అయితే కొన్ని రెస్టారెంట్లు.. మాత్రం ఫుడ్‌లో క్వాలిటీ పాటించకుండా కస్టమర్లను ఆస్పత్రి పాలు చేస్తున్నారు. తాజాగా కుళ్లిన చికెన్ బిర్యానీ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ పట్టణంలోని మన్నత్ బిర్యానీ మండి హోటల్ లో కొందరు బిర్యానీ తినేందుకు వెళ్లారు. అయితే అక్కడ బిర్యానీ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. బాధితుల వివరాల ప్రకారం..శనివారం హోటల్ లో బిర్నానీ తినన ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మరో 15 మందికి వాంతులయ్యాయి. ఇందులో 14 మంది నర్సాపూర్ లో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్లు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే బిర్యానీలో వాడిన కుళ్లిన చికెన్ నాణ్యతలేని వంట నూనెల కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్ స్పెక్టర్ సునీత, డిప్యూటీ డీఎంహెచ్ వో నిర్మల ,మున్సిపల్ కమిషనర్ వేణు గోపాలు హోటల్ లను తనిఖీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపామని రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఇలాంటి నాణ్యత లేని ఆహారం అందిస్తున్న హోటల్స్ పై దాడులు చేసి సీజ్ చేయాలని.. స్థానికులు కోరుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.