20 GRADUATES VOTES ENROLLED FROM A SINGLE DOOR NUMBER IN KHAMMAM ONLY THREE ARE GENUINE 17 FAKE BA KMM
Khammam: ఖమ్మంలో ఒకే ఇంట్లో 20 ‘ఎమ్మెల్సీ’ ఓట్లు... అధికారులు ఆరా తీస్తే.. ఈ లీలల వెనుక...
ప్రతీకాత్మక చిత్రం
ఇది ఎవరి పని అనేది అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఇలా ఓటర్లను నమోదు చేయించాయా? అనే అనుమానం ఉంది. అయితే, అలా చేయించింది ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? దీనిపై అధికారులు మరింత సమగ్రంగా విచారణ జరిపితే కానీ తెలియదు.
(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్ 18)
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నకిలీలలు వెల్లువెత్తుతున్నాయి. లేని వారి పేరిట ఓట్ల దందా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇవేవో మామూలు ఎన్నికల్లో జరిగే తప్పిదాలే అనుకుంటే పొరపాటు పడ్డట్లే. పట్టభధ్రుల ఎన్నికలల్లో జరిగిన నయా దందా. గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్లలో నయా నజర్ మొదలైంది. తాజాగా భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకే ఇంటి నంబర్ పై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఓట్లు నమోదైనట్టు తేలింది. వాటిలో 17 గ్రాడ్యుయేట్ ఓటర్ల లెక్కలు తప్పు అని క్షేత్ర స్థాయి వాస్తవాలు చెబుతున్నాయి. అధికారులు రంగంలోకి దిగి ఆరా తీస్తే ఆ ఇంటి యజమాని మాత్రం తమ ఇంటిలో కేవలం నలుగురు పట్టభధ్రులు మాత్రమే ఉన్నామని...మిగిలిన వారెవరో తమకు తెలియదని తేల్చి చెప్పడంతో అధికారులు ఖంగు తిన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రైటర్ బస్తీ కాలనీకి చెందిన 15వ వార్డు 8-3-19 నంబరు గల ఇంటి యజమాని వాసమళ్ళ ఏసురత్నం ఓటర్ల జాబితా ప్రకారం ఆ ఇంటి నెంబరుపై ఏకంగా 20 ఓట్లు నమోదు కావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులు ఆ ఇంటి యజమానిని ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్న అధికారులు నోర్లు వెళ్ళబెట్టారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటిలో తనతో పాటు ముగ్గురు పట్టభధ్రులు మాత్రమే ఉన్నారని...మిగతా 17 మంది ఎవరో కూడా తమకు తెలియదని వారు తెలిపారు. వారి వివరాలను తెలుపగా వారి పేర్లు కూడా ఎప్పుడూ వినలేదని ఇంటి యజమాని తెలిపారు. ఓటర్ల జాబితాను అధికారులు తీరికగా పరిశీలించగా ఇదే కాకుండా మరెన్నో తప్పిదాలు ఉన్నాయని గుర్తించారు. ఒకే ఓటరు పేరు రెండు పోలింగ్ స్టేషన్లలో నమోదు అయినట్టు కూడా గుర్తించారు. మరి వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
అయితే, ఇది ఎవరి పని అనేది అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఇలా ఓటర్లను నమోదు చేయించాయా? అనే అనుమానం ఉంది. అయితే, అలా చేయించింది ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? దీనిపై అధికారులు మరింత సమగ్రంగా విచారణ జరిపితే కానీ తెలియదు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.